సత్తుపల్లి.. ఆదర్శ మునిసిపాలిటీ

ABN , First Publish Date - 2021-03-29T04:57:41+05:30 IST

అభివృద్ధిలో ముందున్న సత్తుపల్లి మునిసిపాలిటీ రాష్ట్రంలో ఆదర్శవంతమైనదని కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ అన్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరం సాధారణ అంచనా బడ్జెట్‌, 2020-21 సవరణ బడ్జెట్‌ ఆమోదం కొరకై కౌన్సిల్‌ సమావేశం స్థానిక మునిసిపల్‌ ఆఫీ్‌సలో ఆదివారం నిర్వహించారు.

సత్తుపల్లి.. ఆదర్శ మునిసిపాలిటీ

 అభివృద్ధికి మంత్రి కేటీఆర్‌ నిధులిస్తారు

 బడ్జెట్‌ సమావేశాల్లో ఎమ్మెల్యే సండ్ర, కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌

సత్తుపల్లి, మార్చి 28: అభివృద్ధిలో ముందున్న సత్తుపల్లి మునిసిపాలిటీ రాష్ట్రంలో ఆదర్శవంతమైనదని కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ అన్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరం సాధారణ అంచనా బడ్జెట్‌, 2020-21 సవరణ బడ్జెట్‌ ఆమోదం కొరకై కౌన్సిల్‌ సమావేశం స్థానిక మునిసిపల్‌ ఆఫీ్‌సలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలసి కలెక్టర్‌ బడ్జెట్‌కు ఆమోదం తెలిపారు. అన్నిహంగులతో నిర్మించుకున్న నూతన భవన ప్రారంభోత్సవం వాయిదా పడిందన్నారు. డంపింగ్‌యార్డు సమస్య తీరిందని, నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. అభివృద్ధిలో సత్తుపల్లి వేగమని, ఖమ్మంకంటే దీటుగా దూసుకెళ్తుందన్నారు. ఫారెస్ట్‌ అర్బన్‌పార్క్‌తో పాటు జేవీఆర్‌ పార్క్‌ సుందరీకరణ పనులు పూర్తవుతున్నట్లు చెప్పారు. కూల్చివేసిన ఆర్‌అండ్‌బీ క్వార్టర్స్‌ వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్‌లు నిర్మిస్తామని, దీంతో పట్టణంలో ట్రాఫిక్‌ సమస్య తీరనుందన్నారు. ఇంకా ఓపెన్‌ ప్లేస్‌లలో పార్క్‌ల నిర్మాణం చేపట్టాలని, అవసరమైనంత వరకు పబ్లిక్‌ టాయిలెట్స్‌ నిర్మించాలని సూచించారు. షాపింగ్‌ మాల్స్‌, పెట్రోల్‌బంకులు, ఇతర వ్యాపార, వాణిజ్య సముదాయాల్లో టాయిలెట్స్‌ తప్పక ఉండాలని చెప్పారు. తామర, వేశ్యకాంతల చెరువుల వద్ద ట్యాంక్‌బండులను త్వరలోనే ఏర్పాటు చేస్తామన్నారు.

అభివృద్ధికి కేటీఆర్‌ సహకారం ఉంటుంది: సండ్ర

పట్టణ ప్రజలకు అందించనున్న జ్యూట్‌బ్యాగ్స్‌, తడి, పొడిచెత్త బుట్టలను కలెక్టర్‌తో కలసి ఎమ్మెల్యే సండ్ర ఆవిష్కరించారు. సత్తుపల్లి అభివృద్ధికి మంత్రి కేటీఆర్‌ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. సత్తుపల్లిని పర్యాటకస్థలంగా రూపొందించేందుకు మునిసిపల్‌ కౌన్సిల్‌తో పాటు ప్రజలు సహకరించాలని కోరారు. పన్నులను సకాలంలో చెల్లించి మునిసిపాల్టీ అభివృద్ధికి తోడ్పాటును అందించాలన్నారు. కరోనాపై ప్రతిఒక్కరం అప్రమత్తంగా ఉండాలని, మాస్క్‌లు, శానిటైజర్లు, భౌతికదూరం తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అనంతరం నూతన మునిసిపల్‌ భవనాన్ని పరిశీలించి చైర్మన్‌ కూసంపూడి మహేష్‌, కమీషనర్‌ కే.సుజాతలకు కలెక్టర్‌, ఎమ్మెల్యేలు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఆర్‌డీవో సూర్యనారాయణ, తహసీల్దార్‌ కేవీఎంఏ.మీనన్‌, గిర్దావర్‌ ఎస్‌.విజయభాస్కర్‌, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

ఫర్నీచర్‌ బావుంది.. పరిపాలన దూసుకెళ్లాలి

సత్తుపల్లిరూరల్‌: రూ.3కోట్ల టీఎ్‌సఎ్‌ఫఐడీసీ నిధులతో నిర్మితమైన నూతన మునిసిపల్‌ భవనంలో ఏర్పాటుచేసిన ఫర్నీచర్‌ బావుందని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కితాబిచ్చారు. ఆదివారం కలెక్టర్‌ ఆర్వీ.కర్ణన్‌తో కలసి భవనాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే కౌన్సిల్‌ సమావేశ మందిరాన్ని చూసి అద్భుతంగా తీర్చిదిద్దారన్నారు.  

Updated Date - 2021-03-29T04:57:41+05:30 IST