ఇసుక, గ్రావెల్ క్వారీలకు ప్రాతిపాదనలు ఇవ్వండి
ABN , First Publish Date - 2021-01-12T05:31:19+05:30 IST
జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీతమ్మ సాగర్ బహుళార్ధక ప్రాజెక్టు పనులకు అవసరమైన ఇసుక, గ్రావెల్ క్వారీల ఏర్పాటుకు ప్రతిపాదనలు అందజేయాలని జిల్లా అదనపు కలెక్టర్‌లు కె వెంకటేశ్వర్లు, అనుదీ్‌ప అధికారులను ఆదేశించారు.

అధికారులను ఆదేశించిన అదనపు కలెక్టర్‌లు
కొత్తగూడెం కలెక్టరేట్, జనవరి11: జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీతమ్మ సాగర్ బహుళార్ధక ప్రాజెక్టు పనులకు అవసరమైన ఇసుక, గ్రావెల్ క్వారీల ఏర్పాటుకు ప్రతిపాదనలు అందజేయాలని జిల్లా అదనపు కలెక్టర్‌లు కె వెంకటేశ్వర్లు, అనుదీ్‌ప అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశపు మందిరంలో ఇరిగేషన్, మైనింగ్, గ్రౌండ్ వాటర్, ఎన్‌ఎండీసీ, రెవెన్యు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హెలిక్యాప్టర్, పైలాన్ ఏర్పాటు స్థల పరిశీలన చేయాలన్నారు. పనులు నిరంతరాయంగా జరిగేందుకు ఇసుక, గ్రావెల్ కొరత లేకుండా చూడాలన్నారు. అందుకు తగిన అంచనాలు నివేధికల అందజేయాలన్నారు. యాస్పిరేషన్ పారామీటర్లు ప్రతి నెల 7వ తేదీలోగా అందజేయాలని వారు ఆదేశించారు. సోమవారం నిర్వహించిన మరో సమావేశంలో మహిళా శిశు సంక్షేమ, వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, మత్సశాఖ, డీఆర్‌డీఏ, సహకార, ఇరిగేషన్, మార్కెటింగ్, ఉపాధికల్పన, మిషన్ భగీరఽథ, రెండు పడక గదులు పంచాయతీరాజ్, అధికారులతో యాస్పిరేషన్ పారమీటర్లపై సమావేశం నిర్వహించారు. నీటిఆయోగ్ మన జిల్లాను యాస్పిరేషన్ జిల్లాగా ప్రకటించినందున అధికారులు వాటిని పరిశీలన చేయడంతో పాటు ఆ ప్రకారం నివేదికలు అందజేయాలన్నారు. వీటిలో వ్యత్యాసాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అధికారులు గ్రోత్ చార్టు నిర్వహాణతో పాటు రిజిస్టర్లు నిర్వహించాలన్నారు. వారం వారం నిర్ధేశించిన విధంగా పారమీటర్లును అందజేయాలని వారు ఆదేశించారు.