నేడు సద్దుల సంబురం

ABN , First Publish Date - 2021-10-14T06:08:02+05:30 IST

నేడు సద్దుల సంబురం

నేడు సద్దుల సంబురం
పారు వేట ఉత్సవానికిసిద్ధమైన ఖమ్మం జమ్మిబండ

మున్నేరు వద్ద బతుకమ్మ నిమజ్జనానికి పటిష్ఠ ఏర్పాట్లు

ఖమ్మంఖానాపురంహవేలి, అక్టోబరు 13: తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ వేడుకలు గురువారం జరిగే సద్దుల బతుకమ్మతో ముగియనున్నాయి. గత తొమ్మిది రోజులుగా మహి ళలు రకరకాల పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మలను ఆలయాలు, కూడళ్లలో ఉంచి ఆడిపాడారు. అయితే గురువారం జరిగే నిమజ్జన కార్యక్రమానికి సంబంధించి నగరంలోని మున్నేరు వద్ద అధికారులు ఏర్పాట్లను చేస్తున్నారు. 

పోలీసుశాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు

ఖమ్మంక్రైం:ఖమ్మం పోలీసుశాఖ ఆధ్వర్యంలో నగ రంలోని పరేడ్‌ మైదానంలో బుధవారం బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో పోలీసు కమిషనర్‌ విష్ణు ఎస్‌ వారియర్‌, ఇతర పోలీసు అధికారులు కుటుంబ సమేతంగా పాల్గొ న్నారు. ఈ సందర్భంగా సీపీ సతీమణి హృదయ్‌మీనన్‌ గౌరమ్మకు పూజ చేసి వేడుకలు ప్రారంభించారు. కార్యక్రమంలో ఏడీసీపీలు సుభాష్‌చంద్రబోస్‌, కుమారస్వామి, ఏఎస్పీ స్నేహామేహ్రా, ఏసీపీలు ఆంజనేయులు, బస్వారెడ్డి, రామోజీ రమేష్‌, రామానుజం, జహం గీర్‌, విజయ్‌బాబు, సీఐలు చిట్టిబాబు, శ్రీధర్‌, అంజలి, సర్వయ్య, ఏవో అక్తరున్నీసాబేగం, ఆర్‌ఐలు రవి, శ్రీనివాస్‌ సాంబశివరావు, తిరుపతి, శ్రీశైలం, పాల్గొన్నారు.

రేపు విజయదశమి 

ఇరుజిల్లాల్లో దసరా వేడుకలకు సర్వంసిద్ధం

ఖమ్మం జమ్మిబండలో పారువేటకు ఏర్పాట్లు

భద్రాద్రిలో శ్రీరామ మహా పట్టాభిషేకం, శ్రీరామలీలా మహోత్సవానికి సన్నాహాలు

భద్రాచలం/ ఖమ్మం ఖానాపురం హవేలి: ఆడంబరాలకు ఆలవాలంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అత్యంత ఘనంగా నిర్వహించు కునే దసరా పండుగకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురు వారం సద్దుల బతుకమ్మ చెప్పే సుద్దులను మనసు నిండా నింపుకొని చెడుపై మంచి విజయానికి సూచిక గా శుక్రవారం విజయదశమిని ప్రజలు జరుపుకోను న్నారు. అన్నిచోట్ల ఉదయం ఆయుధ పూజకు, సాయంత్రం సువర్ణ వర్షం కురిపిస్తుందని నమ్మే శమీ, పాలపిట్టల దర్శనానికి సర్వం సిద్ధం చేశారు. ఆశ్వ యుజమాసం శ్రవణా నక్షత్రం కొత్త విద్యలు నేర్చుకో వడానికి అనుకూలమైనందున ఔత్సాహికులు ఆ దిశ గా అడుగులు వేయనున్నారు. కాగా మంత్రి పువ్వాడ అజయ్‌ జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఖమ్మం జమ్మిబండ వద్ద పారువేట ఉత్స వాన్ని నిర్వహించనున్నారు. ఇందుకోసం జమ్మిబండ వద్ద ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ కార్యక్రమాలను లక్ష్మీనర్సింహస్వామి దేవాలయ ఈవో కొత్తూరు జగ న్మోహన్‌రావు పర్యవేక్షిస్తున్నారు. ఇక దక్షిణ అయోధ్య గా విరాజిల్లుతున్న భద్రాచల పుణ్యక్షేత్రంలో  సీతా రామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో శుక్రవారం విజయదశమి వేడుకలు నిర్వహించనున్నారు. ఈ సమయంలో అమ్మవారు నిజరూపలక్ష్మీ అలంకారంలో దర్శనమివ్వనుండగా  శ్రీరామాయణ పారాయణ మహోత్సవాల ముగింపును పురస్కరించుకొని శ్రీరామ మహాపట్టాభిషేకం నిర్వహించనున్నారు. విజయో త్సవం (శమీ పూజ), శ్రీరామ లీలా మహోత్సవం నిర్వహించనున్నారు. కొవిడ్‌ నిబంధనల నేపఽ థ్యంలో ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా  దేవస్థానం అధికారులు శ్రీరామలీలా మహోత్సవం నిర్వహించనున్నారు. 

వీరలక్ష్మిగా దర్శనమిచ్చిన అమ్మవారు

శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో వేంచేసి ఉన్న లక్ష్మీతాయారు అమ్మవారు బుధవారం వీరలక్ష్మి అలం కారంలో దర్శనమిచ్చారు. శ్రీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి వీరలక్ష్మి అలంకారం ధరింప జేసి ప్రత్యేకపూజలు నిర్వహించారు. సంక్షిప్త రామా యణ హోమం, సామూహిక కుంకుమార్చన, విశేష దర్బారుసేవ, నివేదన, మహామంత్ర పుష్పం, ప్రసాద గోస్టి నిర్వహించారు. ఈ సందర్భంగా అధికసంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. గురువారం మహాలక్ష్మి అలంకారంలో దర్శనమివ్వనున్నారు. Updated Date - 2021-10-14T06:08:02+05:30 IST