పేదలకు భూ పట్టాలివ్వాలి

ABN , First Publish Date - 2021-02-09T05:06:41+05:30 IST

ఏజెన్సీలోని మారుమూల ప్రాంతాల్లో నివాసం ఉండే నిరుపేదలకు భూమి పట్టాలు అందజేయాలని కోరుతూ గ్రామీణ పేదల సంఘం ఆఽధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

పేదలకు భూ పట్టాలివ్వాలి
పట్టణంలో ర్యాలీ నిర్వహిస్తున్న దృశ్యం

గ్రామీణ పేదల సంఘం డిమాండ్‌ 

ఐటీడీఏ ఎదుట ధర్నా

భద్రాచలం, ఫిబ్రవరి 8: ఏజెన్సీలోని మారుమూల ప్రాంతాల్లో నివాసం ఉండే నిరుపేదలకు భూమి పట్టాలు అందజేయాలని కోరుతూ గ్రామీణ పేదల సంఘం ఆఽధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సోమవారం ఉదయం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ఆదివాసీ గిరిజనులు పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయం వద్ద నుంచి అంబేద్కర సెంటర్‌, గోళ్లగట్టరోడ్డు మీదుగా ఐటీడీఏ వద్దకు చేరుకున్నారు. కొద్దిసేపు ఐటీడీఏ ఎదుట ధర్నా నిర్వహించి అనంతరం ఐటీడీఏ కార్యాలయంలో వినతిపత్రం అందజేసారు. ఈ సందర్భంగా గ్రామీణ పేదల సంఘం రాష్ట్ర అధ్యక్షులు డా. జతిన్‌కుమార్‌ మాట్లాడుతూ ఏజెన్సీలో ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న పోడు భూములలో అటవీ శాఖాధికారులు మొక్కలు నాటడం, కందకాలు తవ్వడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కార్యదర్శులు విజయేందర్‌రావు, సహాయ కార్యదర్శిముత్తయ్య, జక్కం శ్రీను, కల్తి రామచంద్రయ్య, బాణాల లక్ష్మణాచారి, మల్లేశ్వరరావు, వాసం మంగయ్య, ఆదినారాయణ, కల్తి యర్రబాబు పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-09T05:06:41+05:30 IST