ఆర్టీసీ ప్రైవేటీకరణ కుట్రలను తిప్పికొట్టాలి
ABN , First Publish Date - 2021-10-21T05:21:18+05:30 IST
ప్రజారవాణా సంస్థ టీఎస్‌ఆర్‌టీసీని ప్రైవేటీకరణ ముప్పు నుంచి పరిర క్షించుకునేందుకు పార్టీలు, యూనియన్లకతీతంగా ప్రజల భాగస్వామ్యంతో ఉద్యమించాలని సీపీఐ జి ల్లా కార్యదర్శి ఎస్‌కే. సాబీర్‌పాషా పిలుపునిచ్చారు.

కొత్తగూడెం, అక్టోబరు 20: ప్రజారవాణా సంస్థ టీఎస్‌ఆర్‌టీసీని ప్రైవేటీకరణ ముప్పు నుంచి పరిర క్షించుకునేందుకు పార్టీలు, యూనియన్లకతీతంగా ప్రజల భాగస్వామ్యంతో ఉద్యమించాలని సీపీఐ జి ల్లా కార్యదర్శి ఎస్‌కే. సాబీర్‌పాషా పిలుపునిచ్చారు. బుధవారం ఎఐటీయూసీ జిల్లా కార్యాలయం శేషగి రిభవన్‌లో జరిగిన కార్మికసంఘాల సంయుక్త రౌం డ్ టేబుల్‌సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా హజరై మాట్లాడారు. ఆర్టీసీ సంస్థను నష్టాల ఊబి లోకి నెట్టి ఆ నెపంతో ప్రైవేటీకరిం చేందుకు రా ష్ట్ర ప్రభుత్వం కుట్రచేస్తోందని విమర్శించారు. నష్టా ల్లోకి నెట్టివేసే కుట్రలో భాగంగానే సమస్యల పరి ష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెను విరమించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకుండా మూడు నెలలపాటు జాప్యం చేసిందని ఆరోపించారు. సమ్మె అనంతరం కరోనా లాక్‌డౌన్ మూలంగా మరింత నష్టాల బారిన పడటం ప్రభుత్వానికి కలిసివచ్చిన అంశమన్నారు. ఈ సమావేశంలో ఎఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు నరాటి ప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి గుత్తుల సత్యనారాయణ, కార్యదర్శులు పోగుల కోటేశ్వరర రావు, కంచర్ల జమలయ్య, సీఐటీయూ జిల్లా ఉపా ధ్యక్షులు కొండపల్లి శ్రీధర్, ఇప్టూ జిల్లా కార్యదర్శి ఎన్. సంజీవ్, ఐఎన్‌టీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు కాలం నాగభూషణం, ఇప్టూ జిల్లా కార్యదర్శి ఎల్. విశ్వనాధం, హెచ్‌ఎఎస్ జిల్లా నాయకులు రమేష్, ఆర్టీసీ యూనియన్ నాయకులు పాల్గొన్నారు.