ఆర్టీసీ కార్గో సేవలు విస్తృతం చేయాలి

ABN , First Publish Date - 2021-07-09T04:53:22+05:30 IST

ఆర్టీసీ సంస్థలో కార్గోస్‌, పార్శిల్‌ సేవలు విస్తృతం చేసేందుకు కష్టపడాలని ఖమ్మం ఆర్టీసీ ఆర్‌ఎం సోలోమాన్‌ రాజు కోరారు.

ఆర్టీసీ కార్గో సేవలు విస్తృతం చేయాలి
మాట్లాడుతున్న ఆర్‌ఎం సోలోమాన్‌ రాజు

ఆర్‌ఎం సోలోమాన్‌ రాజు
కొత్తగూడెం పోస్టాఫీస్‌ సెంటర్‌, జూలై 8:
ఆర్టీసీ సంస్థలో కార్గోస్‌, పార్శిల్‌ సేవలు విస్తృతం చేసేందుకు కష్టపడాలని ఖమ్మం ఆర్టీసీ ఆర్‌ఎం సోలోమాన్‌ రాజు కోరారు. గురువారం జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం ఆర్టీసీ డిపోలో ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వ హించారు. ఈ సందర్భంగా పట్టణ, గ్రామీణ స్థాయి వరకు ఆర్టీసీ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన కార్గోస్‌, పార్శిల్‌ సేవలను విస్త రింపజేయాలన్నారు. అందుకు మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటీవ్స్‌, వారి బృందాలు గ్రామీణ వ్యాపారులకు సంస్థ అందిస్తున్న సేవల గురించి ప్రచారం చేయాల్సిన అవసరం ఉందన్నారు. రైతులు, ధాన్యం, మొక్క జొన్నలు, మామిడి, నిమ్మ, మిర్చి లాంటి పంట ఉత్పత్తులు, విద్యాశాఖ వారి పుస్తకాలు, స్కూల్‌ యూనిఫామ్‌లు గమ్యానికి చేరవేయడానికి సిద్ధంగా ఉండాలన్నారు. ప్రయాణీకులతో పా టు వివిధ రకాల సేవల నుంచి ఆర్టీసీ సంస్థ పురోగాభివృద్ధికి సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ సమీక్ష సమావేశంలో ఆర్టీసీ కొత్తగూడెం డీవీఎం శ్రీకృష్ణ, డీఎం వెంకటేశ్వర్‌బాబు, రీజియన్‌ కార్గోస్‌ ఇన్‌చార్జ్‌ విజయశ్రీ, సీఐ శివ ప్రసాద్‌, ఆరు డిపోల ఎగ్జిక్యూటీవ్‌లు, రీజనల్‌ ఎగ్జిక్యూటీవ్‌, ట్రాఫిక్‌ సూపర్‌వైజర్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-09T04:53:22+05:30 IST