ఓ బాటసారి.. ఇది గతుకుల రహదారి

ABN , First Publish Date - 2021-11-22T04:41:21+05:30 IST

మండలంలోని పిబండారుగూడెం ప్రధాన రహదారి అధ్వానంగా మారింది. పదేళ్లుగా మరమ్మ తులు చేపట్టకపోవడంతో ఆదివాసీలు నరకం చూస్తున్నారు.

ఓ బాటసారి.. ఇది గతుకుల రహదారి
కంకర లేచిన ప్రధాన రహదారి

పదేళ్లుగా మరమ్మతులకు నోచుకోని ప్రధాన రహదారి

ఇబ్బందులు పడుతున్న బండారుగూడెం ఆదివాసీలు

దుమ్ముగూడెం నవంబరు 21:మండలంలోని పిబండారుగూడెం ప్రధాన రహదారి అధ్వానంగా మారింది. పదేళ్లుగా మరమ్మ తులు చేపట్టకపోవడంతో ఆదివాసీలు నరకం చూస్తున్నారు. నూటా యాభై ఆదివాసీ కుటుంబాలు నివాసముంటున్న ఈ గ్రామంలో అత్యవసర వైద్యసహాయం అవసరమైన వారికి గతుకుల రహదారిపై ప్రయాణం నరకంగా మారింది. అలాగే గోదావరికి వరదలు వచ్చిన సందర్భంలో రహదారి మధ్యలో ఉన్న లోలెవల్‌ కల్వర్టు ప్రాంతం పూర్తిగా మునిగి రహదారిపై రాకపోకలు నిలిచిపోతున్నాయి. భద్రాచలం-చర్ల ఆర్‌అండ్‌బీ ప్రధాన రహదారి నుంచి 1.50 కిలోమీటర్ల పాటు పూర్తిగా కంకరరాళ్లు మొనదేలి ఉన్నాయి. దీంతో డికొత్తూగూడెం-రామకృష్ణాపురం మీదుగా చుట్టూ ఐదుకిలోమీటర్లు తిరిగి తూరుబాక ప్రధాన రహదారి చేరుకోవాల్సి వస్తోంది. వరదలు వచ్చిన సమయంలో ఒక్కోసారి 108 వాహనం సైతం గ్రామంలోకి రావడానికి వీలుపడడం లేదు. కంకరరాళ్లు తీవ్రంగా పైకి తేలడంతో ద్విచక్రవాహన దారులు సైతం అదుపు తప్పి పడిపోతున్నారు. నూతన రహదారి నిర్మాణం, మార్గ మద్యంలో ఉన్న లోలెవల్‌ చప్టా ప్రాంతంలో వంతెన నిర్మించాలని స్థానిక ఆదివాసీలు కోరుతున్నారు. 

పదేళ్లుగా నరకం

కంకర రాళ్లు లేచిన ప్రధాన రహదారి సమస్యతో పదేళ్లుగా భాదలు పడుతున్నామని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరి వరదల సమయంలో రహదారి మునిగిపోవడంతో బర్రెలు, గొర్రెలను సురక్షిత ప్రాంతానికి తరలించడం కష్టతరమౌతోందని వాపోతున్నారు. రహదారి నిర్మాణం జరిగి పదేళ్లు పూర్తవగా, మద్యలో కనీస మరమ్మమతులు కూడా చేయలేదని అంటున్నారు. నూతన రహదారి నిర్మించాలని కోరుతున్నారు.


Updated Date - 2021-11-22T04:41:21+05:30 IST