ఎదిగిన బిడ్డలు విగతులుగా..

ABN , First Publish Date - 2021-02-13T05:12:20+05:30 IST

కన్నీరుకే కన్నీరొచ్చే విషాదం ఇది. బాధే బాధపడే దారుణమిది. ఎదిగిన కొడుకులు.. రేపోమాపో కొలువులు సాధించి తమ కలలను సాకారం చేస్తారనుకునే దశలో రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు ఆ యువకులను కడతేర్చింది.

ఎదిగిన బిడ్డలు విగతులుగా..
వినయ్‌కుమార్‌రెడ్డి, శ్రీరామ్‌రెడ్డి (ఫైల్‌ఫొటో)

కన్నవాళ్ల కలలను ఛిద్రం చేసిన రోడ్డు ప్రమాదం

హైదరాబాద్‌లో జరిగిన ఘటనలో

చింతిర్యాల, టీ. కొత్తగూడెం యువకుల దుర్మరణం

గచ్చిబౌలిలో గుడికి వెళ్లి వస్తుండగా దారుణం

మృతులిద్దరూ దగ్గరి బంధువులు

టీ. కొత్తగూడెం యువకుడి నేత్రాలు దానం చేసిన తల్లిదండ్రులు

అశ్వాపురం/ పినపాక, ఫిబ్రవరి 12: కన్నీరుకే కన్నీరొచ్చే విషాదం ఇది. బాధే బాధపడే దారుణమిది. ఎదిగిన కొడుకులు.. రేపోమాపో కొలువులు సాధించి తమ కలలను సాకారం చేస్తారనుకునే దశలో రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు ఆ యువకులను కడతేర్చింది. కన్నవాళ్లను కన్నీటి సంద్రంలో ముంచింది. హైదరా బాద్‌లోని గచ్చిబౌలిలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో అశ్వాపురం మండలం చింతిర్యాల, పినపాక మండలం టీ. కొత్తగూడేనికి చెందిన ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. వీరిలో టీ. కొత్తగూడెం యువకుడి నేత్రాల ను దానం చేసి పుట్టెడు దుఃఖంలోనూ ఆ తల్లిదండ్రులు మానవత్వానికి నిలువెత్తు రూపంగా నిలిచారు. కాగా మృతి చెందిన ఇద్దరు యువకులు సమీప బంధువులు. 

గుడికి వెళ్లి వస్తుండగా..

పినపాక మండలం టీ కొత్తగూడెం గ్రామానికి చెందిన భా స్కర్‌రెడ్డి, వెంకటరమణ దంపతుల కుమారుడు నాసిరెడ్డి వినయ్‌కుమార్‌రెడ్డి (22), అశ్వాపురం మండలం చింతిర్యాలకు చెందిన దినసరపు ప్రసాద్‌రెడ్డి కుమారుడు శ్రీరామ్‌రెడ్డి(21) ఇద్దరూ సమీప బంధువులు. హైదరాబాద్‌లో ఇంజనీరింగ్‌ చదువుతు న్నారు. కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ విఽధించడంతో ఇళ్లకు వచ్చారు. వీరిలో వినయ్‌ తన తండ్రి భాస్కర్‌రెడ్డి నిర్వహించే వ్యాపారంలో చేదోడు వాదోడుగా ఉన్నాడు. శ్రీరామ్‌రెడ్డి తండ్రి ప్రసాద్‌రెడ్డి వ్యవసాయం చేస్తుంటాడు. ఒక్కగానొక్క కుమారుడు కావడంతో స్థోమతకు మించినా ఓ కార్పొరేట్‌ కళాశాలలో ఇంజనీరింగ్‌ చదివిస్తున్నాడు. కరోనా సడలింపుల నేపథ్యంలో కళాశాలలు పరీక్షలు నిర్వహిస్తుండటంతో ఇద్దరూ వాటిని రాసేందుకు హైదరాబాద్‌ వెళ్లారు. గురువారం ఇద్దరూ ద్విచ క్రవాహనంపై గచ్చిబౌలిలోని ఓ ఆలయానికి వెళ్లారు. తిరిగి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న బైక్‌ అదుపుతప్పడంతో తీవ్రం గా గాయపడ్డారు. గమినించిన స్థానికులు ఇద్దరినీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారు చికిత్స పొందుతూ కన్నుమూశారు. కాగా శ్రీరామ్‌రెడ్డి ప్రసాదరెడ్డి దంపతులకు ఒక్కగానొక్క కొడుకు కావటంతో వారు విలపిస్తున్న తీరు పలువురిని కంటతడిపెట్టించింది.కాగా శ్రీరామ్‌రెడ్డి మృతితో చింతిర్యాల గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.

పుట్టెడు దుఃఖంలోనూ నేత్రదానం

అల్లారుముద్దుగా పెంచుకున్న తమ కుమారుడు విగతుడవడం తో భాస్కర్‌రెడ్డి, వెంకటరమణ గుండెల విసేలా రోదించారు. అయినప్పటికీ తమను తాము సముదాయించుకుంటూ తమ కుమారుడి నేత్రాలను వైద్యుల సలహా మేరకు ఎల్‌వీ ప్రసాద్‌ కంటి ఆసుపత్రికి దానమిచ్చారు. వారి నిర్ణయం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. వారిని ఓదార్చే ప్రయత్నం చేశారు.

Updated Date - 2021-02-13T05:12:20+05:30 IST