నెత్తురోడిన రహదారులు
ABN , First Publish Date - 2021-02-01T05:34:39+05:30 IST
ఇరు జిల్లాలో ఆదివా రం రహదారులు నెత్తురోడాయి. వేర్వేరు ప్రాంతాల్లో జరిగి న ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం చెందగా, ఏడుగురు గాయపడ్డారు.

ఇరు జిల్లాల్లో వేర్వేరు ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు
ముగ్గురి దుర్మరణం .. ఏడుగురికి గాయాలు
జూలూరుపాడు/ మణుగూరు/ దుమ్ముగూడెం/ పెను బల్లి/ సత్తుపల్లి రూరల్, జనవరి 31: ఇరు జిల్లాలో ఆదివా రం రహదారులు నెత్తురోడాయి. వేర్వేరు ప్రాంతాల్లో జరిగి న ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం చెందగా, ఏడుగురు గాయపడ్డారు.
కారు, ఆటో ఢీ: నలుగురికి గాయాలు
జూలూరుపాడు మండలంలోని కొమ్ముగూడెం గ్రామ సమీపంలో కారు, ఆటో ఢీకొన్న సంఘటనలో నలుగురికి గాయపడ్డారు.ఈ సంఘటన ఆదివారం జరిగింది. జూలూరుపాడు నుంచి ఆటో ప్రయాణికులను ఎక్కించుకొని కొత్తగూడెం వైపు వెళుతోంది. ఈ క్రమంలో కొత్తగూడెం నుంచి ఖమ్మం వైపు కారు వెళుతోంది. కొమ్ముగూడెం గ్రామ సమీపంలో ఎదురెదురుగా కారు, ఆటో ఢీకొన్నాయి.
ఈ సంఘటనలో ఆటోలో ఉన్న జూలూరుపాడు మండలం దండుమిట్టతండాకు చెందిన భూక్యా వాలీ, ములకలపల్లి మండలం పూసుకుగూడేనికి చెందిన భూక్యా మల్లేష్, టేకులపల్లికి చెందిన భార్యాభర్తలు మూడు రమేష్, మూడు జ్యోతికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108లో కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో తరలించారు. సంఘటన స్థలాన్ని జూలూరుపాడు ఎస్‌ఐ శ్రీకాంత్ సందర్శించి వివరాలను నమోదు చేసుకున్నారు.
రోడ్డు ప్రమాదంలో యువకుని మృతి
దుమ్ముగూడెం జనవరి 31:మండల పరిధిలోని కొత్తపల్లి వద్ద గత నెల 30న ట్రాక్టరు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో ఒక యువకుడు మృతిచెందాడు. సంఘటనపై ఎస్‌ఐ రవికుమార్ ఆదివారం కేసు నమోదు చేశారు. తూర్పుగోదావరి జిల్లా ఎటపాక మండలం రాఘవాపురానికి చెందిన పొడియం జంపన్న, తెల్లం వెంకటే్‌ష ద్విచక్రవాహనంపై ఈనెల 30న కొత్తపల్లికి వచ్చారు. తిరిగి వారి గ్రామానికి వెళ్తున్న క్రమంలో ఎదురుగా అతివేగంగా దూసుకొచ్చిన ట్రాక్టరు వీరి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది.
దీంతో ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న జంపన్న, వెంకటే్ తీవ్రంగా గాయపడ్డారు. వీరివురినీ భద్రాచలం ఆసుపత్రికి తరలించగా, ఈనెల 30న రాత్రి సమయంలో చికిత్సలు పొందుతూ జంపన్న(20) మృతిచెందాడు. ట్రాక్టరు నడుపుతున్న డ్రైవరు చెరుపల్లికి చెందిన రేసు శశికుమార్‌గా తెలిసిందని జంపన్న తండ్రి ఆదివారం ఫిర్యాదు చేశారు.
బైక్, టాటా ఏస్, లారీ ఢీ కొన్న సంఘటనలో..
మణుగూరు, జనవరి 31 : మణుగూరు మండల పరిధిలోని రామానుజవరం ప్రధాన రహదారిపై ఆదివారం మధ్యాహ్నం బైక్, టాటా ఏస్ ట్రాలీ, టిప్పర్ లారీలు డీ కొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఒకరికి గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మణుగూరు నుంచి ద్వి చక్ర వాహనంపై పినపాక ఏడూళ్లబయ్యారం వైపుగా వెళ్తున్న రఘు అనే వ్యక్తిని వెనుకగా వస్తున్న టాటా ఏస్ ట్రాలీ ఈకొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న రఘు కిందపడగా.. మోటార్ బైక్ రోడ్డు పక్కకు దూసుకుపోయింది. బైక్ డీ కొట్టిన టాటా ఏస్ డ్రైవర్ పెనుగొండ నర్సింహారావు(37) కంగారుగా కుడిచేతి వైపు వాహనాన్ని తిప్పడంతో ఎదురుగా వస్తున్న బీటీపీఎ్‌సకు బొగ్గు రవాణా చేసే టిప్పర్ లారీ ఢీకొట్టింది.
దీంతో డ్రైవర్ పెనుగొండ నర్సింహారావు వాహనం నుంచి ఎగిరి రోడ్డుపక్కన ఉన్న పల్లంలో పడిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. టాటా ఏస్‌లో ఉన్న మరో వ్యక్తి కుడిపూడి నాగరాజు(45)కు తీవ్ర గాయాలకు కాగా 108 అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మార్గం మధ్యలోనే నాగరాజు మృతి చెందినట్లు బంధువులు పేర్కొన్నారు. సమితిసింగారం రిక్షా కాలనీకి చెందిన నర్సింహరావు, బ్రహ్మంగారి గుట్ట ప్రాంతానికి చెందిన నాగరాలు ఏడూళ్లబయ్యారం కారస్ రోడ్డు సమీపంలోని ఉప్పాక వెళ్లే రహదారికి సమీపాన వరలు తయారు చేసే పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు.
స్పందించిన రేగా కాంతారావు
మణుగూరు నుంచి పినపాక వైపుగా వెళ్తున్న ఎమ్మెల్యే రేగా కాంతారావు రహదారిపై అప్పుడే జరిగిన ప్రమాదాన్ని చూసి వెంటనే వాహనాన్ని ఆపారు. 108 వాహనాన్ని పోన్‌చేసి క్షతగాత్రుణ్ని చికిత్స నిమిత్తం భద్రాచలం ఏరియా ఆసుత్రికి తరలించారు. మృతుడి, క్షతగాత్రుల వివరాలు తెలుసుకున్న ఆయన నర్సింహరావు మృతిపట్ల దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.
దిమ్మెను ఢీకొన్న ఆటో.. డ్రైవర్‌కు గాయాలు
ఆటోలో మేకపోతును తీసుకెళ్తున్న డ్రైవర్ పట్టణ శివారులోని మునిసిపాలిటీ స్వాగత దిమ్మెను ఢీకొనగా తీవ్రగాయాలైన సంఘటన ఆదివారం అర్ధరాత్రి జరిగింది. బ్లూకో ట్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని కిష్టారానికి చెందిన మద్ది శశివర్మరెడ్డి ఆటోలో మేకపోతును సత్తుపల్లికి తీసుకొస్తుండగా అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న దిమ్మెను ఢీకొన్నాడు.
తీవ్రగాయాలైన శశివర్మరెడ్డిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి మెరుగ్గానే ఉందని బంధువులు తెలిపారు. పోలీసులు కేసు నమోదుచేసి ధర్యాప్తు చేస్తున్నారు. కాగా దిమ్మె కనుక లేకున్నట్లయితే పక్కనే ఉన్న పెద్ద గుంతలోకి ఆటో దూసుకెళ్లినట్లయితే ప్రాణాల మీద కు వచ్చేదని స్థానికులు చెప్పారు.
రోడ్డుప్రమాదంలో యువకుడికి తీవ్రగాయాలు
వీఎంబంజర్ నుంచి కల్లూరు వైపు వెళ్తున్న ద్విచక్రవాహనానిన్న కల్లూరు వైపునుంచి ఎదురుగా వచ్చిన టాటాఏస్ వాహనం ఢీకొనడంతో యువకుడికి గాయాలైన సంఘటన ఆదివారం మండలంలోని సీతారాంపురం వద్ద జరిగింది. టేకులపల్లి గ్రామానికి చెందిన మాదాసు నాగేష్ ద్విచక్రవాహనంపై వీఎంబంజర్ నుంచి కల్లూరు వైపు వెళ్తుండగా ఎదురుగా వచ్చిన మరో వాహనాన్ని తప్పించే ప్రయత్నంలో టాటాఏసీ వాహనం ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నాగేష్ తలకు, కాలుకు తీవ్రగాయాలు కావడంతో పెనుబల్లి ఆసుపత్రికి తరలించి ప్రథమచికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించారు. వీఎంబంజర్ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.