నియామక పత్రాల అందజేత

ABN , First Publish Date - 2021-07-25T05:08:52+05:30 IST

షెడ్యూల్‌ కులాల అభివృద్ధి శాఖ ద్వారా నిర్వహిస్తున్న కార్పొరేట్‌ కళాశాలలో ప్రవేశం పొందిన విద్యార్థులకు శనివారం కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ నియామకపు పత్రాలను అందచేశారు.

నియామక పత్రాల అందజేత
విద్యార్థులకు నియామక పత్రాలను అందిస్తున్న కలెక్టర్‌ గౌతమ్‌

ఖమ్మంకలెక్టరేట్‌, జూలై24:  షెడ్యూల్‌ కులాల అభివృద్ధి శాఖ ద్వారా నిర్వహిస్తున్న కార్పొరేట్‌ కళాశాలలో ప్రవేశం పొందిన విద్యార్థులకు శనివారం కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ నియామకపు పత్రాలను అందచేశారు. ఈ పాస్‌ వెబ్‌ సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకున్న ఎస్సీ,ఎస్టీ, బీసీ మైనార్టీ, వికలాంగుల విద్యార్థుల్లో ఎంపికైన 86 మంది కార్పొరేట్‌ కళాశాల్లో ప్రవేశం కొరకు ఎంపికైనట్లు సంక్షేమశాఖ అధికారి సత్యనారాయణ కలెక్టర్‌కు వివరించారు.  

  కలెక్టర్‌ను కలిసిన సీనియర్‌ సిటిజన్లు

 కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ను సీనియర్‌ సిటిజన్స్‌ ఆర్గనైజేషన్‌ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసారు. జిల్లాలో చేపట్టిన  కార్యక్రమాల గురించి కలెక్టర్‌కు వివరించారు.  కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఆర్‌ రవీందర్‌రావు, అనాసి రాధాకృష్ణ, సాధినేని జనార్థన్‌రావు, శ్రీహరి, కొత్త సత్యనా రాయణరెడ్డి, జల్లా వెంకటేశ్వర్లు, వేగినాటి లక్ష్మయ్య, నాగేశ్వర రావు, శంకర్‌రావు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.  

 కలెక్టర్‌ను కలిసిన క్రికెట్‌ సంఘం భాధ్యులు

ఖమ్మంస్పోర్ట్స్‌: కలెక్టర్‌ను శనివారం జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ బాధ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు.  జిల్లాలో క్రికెట్‌ అభివృద్ధి, కోచింగ్‌, టర్ఫ్‌ వికెట్‌ పిచ్‌ మెయింటెన్స్‌ తదితర అంశాలపై  సంఘం జిల్లా మేనేజర్‌ ఫారూఖ్‌, పలువురు క్రీడాకారులు వివరించారు.

Updated Date - 2021-07-25T05:08:52+05:30 IST