వలంటీర్లను నియమించాలి: యూటీఎఫ్‌

ABN , First Publish Date - 2021-11-10T04:45:30+05:30 IST

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెరిగినందున అవసరమైన మేరకు విద్యావలంటీర్లను నియమించాలని యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి బండి నర్సింహారావు డిమాండ్‌ చేశారు.

వలంటీర్లను నియమించాలి: యూటీఎఫ్‌

పెనుబల్లి, నవంబరు 9: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెరిగినందున అవసరమైన మేరకు విద్యావలంటీర్లను నియమించాలని యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి బండి నర్సింహారావు డిమాండ్‌ చేశారు. మంగళవారం పెనుబల్లిలో యూటీఎఫ్‌ 8వ మండల మహాసభ అధ్యక్షుడు జి.హన్మంతు అధ్యక్షతన జరిగింది. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో పెరిగిన విద్యార్థుల నమోదును నిలుపుకోవాలని జిల్లా అధికారులకు విన్నవిస్తే అందుకు విరుద్ధంగా విద్యార్థుల సగటు హాజరు ఆధారంగా ఉపాధ్యాయుల సంఖ్యను నిర్ణయించి ఉపాధ్యాయులను డిప్యూటేషన్‌లో పెట్టే ఆలోచనలు అధికారులు చేస్తున్నారని ఆరోపించారు. జిల్లా కార్యదర్శి ఎం.రాజేశ్వరరావు, మండల ప్రధాన కార్యదర్శి జి.కృష్ణారావు, సీనియర్‌ నాయకులు రామారావు, ఎం.నర్సింహారావు, కె.శ్రీనివాసరావు, ఆర్‌.నాగేశ్వరరావు, కె.నాగరాజు, రంగబాబు, పులి వెంకటేశ్వర్లు, వి.రవికుమార్‌, ప్రసాద్‌, వీరస్వామి, మురళీకృష్ణ, అనురాధ పాల్గొన్నారు.


Updated Date - 2021-11-10T04:45:30+05:30 IST