అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యం పట్టివేత

ABN , First Publish Date - 2021-07-13T04:56:42+05:30 IST

ఇల్లెందు నుంచి కాకినాడకు అక్రమంగా తరలిస్తున్న 200క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యాన్ని కొత్తగూడెంలోని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సోమవారం పట్టుకుని కేసునమోదు చేశారు.

అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యం పట్టివేత
కొత్తగూడెం పోలీసుల అదుపులో పీడీఎస్‌(రేషన్‌)బియ్యాన్ని తరలిస్తూ పట్టుబడ్డ లారీ

కొత్తగూడెం పోలీసుల అదుపులో నిందుతులు 

కొత్తగూడెం, జూలై 12: ఇల్లెందు నుంచి కాకినాడకు అక్రమంగా తరలిస్తున్న 200క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యాన్ని కొత్తగూడెంలోని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సోమవారం పట్టుకుని కేసునమోదు చేశారు. టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు సోమవారం కొత్తగూడెంలో పోలీసులు పీడీఎస్‌ బియ్యాన్ని పట్టుకుని, రవాణా చేస్తున్న లారీని సాఽ్వదీనం చేసుకుని కేసు నమోదుచేశారు. ఇల్లెందు మండలం లచ్చగూడేనికి చెందిన బత్తుల రాజు అనే వ్యక్తి లారీ డ్రైవర్‌ పుల్లారావు, క్లీనర్‌ రమేష్‌ అనే ఇద్దరి సాయంతో ఇల్లెందు నుంచి కాకినాడకు అక్రమంగా రేషన్‌ బియ్యం తరలిస్తుండగా కొత్తగూడెం 1వటౌన్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలోని పోస్టాఫీసు సెంటర్‌లో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకొన్నారు. డ్రైవర్‌ పుల్లారావు, క్లీనర్‌ రమేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆ లారీని కొత్తగూడెం ఒకటో పట్టణ పో లీసుస్టేషన్‌కు తరలించారు. బత్తుల రాజు, లారీ డ్రైవర్‌, క్లీనర్‌ ముగ్గురు వ్యక్తులపై సీఐ రాజు కేసు నమోదు చేశారు.


Updated Date - 2021-07-13T04:56:42+05:30 IST