చట్టాలపై అవగాహన పెంచుకోవాలి

ABN , First Publish Date - 2021-11-10T04:44:42+05:30 IST

న్యాయ విజ్ఞాన సదస్సుల్లో పాల్గొని చట్టాలపై అవగాహన పెంచుకోవాలని 4వ అదనపు జిల్లా జడ్జీ సీవీఎ్‌స.సాయిభూపతి కోరా రు.

చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
మాట్లాడుతున్న సత్తుపల్లి జడ్జి సాయిభూపతి

సత్తుపల్లి, మధిర న్యాయమూర్తులు సీవీఎస్‌ సాయిభూపతి, ధీరజ్‌కుమార్‌

సత్తుపల్లి/మధిరరూరల్‌, నవంబరు 9: న్యాయ విజ్ఞాన సదస్సుల్లో పాల్గొని చట్టాలపై అవగాహన పెంచుకోవాలని 4వ అదనపు జిల్లా జడ్జీ సీవీఎ్‌స.సాయిభూపతి కోరా రు. న్యాయ సేవా దినోత్సవం సందర్భంగా మంగళవారం సత్తుపల్లి మండల న్యాయసేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో స్థానిక కోర్టులో నిర్వహించిన న్యాయ చైతన్న సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఆజాదీకి అమృత మహోత్సవంలో భాగంగా ఈనెల 2 నుంచి 14వరకు సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో మూడు విడతలుగా సదస్సులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సీనియర్‌ సివిల్‌ జడ్జీ అరుణకుమారి, అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జీ శ్రావణస్వాతి, సెకండ్‌ క్లాస్‌ మేజిస్ర్టేట్‌ గోపాలరావు, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రాచూరి సీతారామయ్యతో పాటు న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, కక్షిదారులు పాల్గొన్నారు.

మధిర రూరల్‌: చట్టాల గురించి ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని మధిర మునిసి్‌ఫకోర్టు జూనియర్‌ సివిల్‌జడ్జి డి.ధీరజ్‌కుమార్‌ సూచించారు. మంగళవారం మధిర మండలం సిరిపురం గ్రామంలో జరిగిన న్యాయచైతన్య సదస్సులో ఆయన మాట్లాడారు. విద్యార్థులు న్యాయవిషయాలపై కూడా అవగాహన చేసుకోవాలని, చట్టాల పట్ల బాధ్యతగా వ్యవహరించాలన్నారు. కార్యక్రమంలో మధిర సీఐ మురళీ, న్యాయవాదులు నంబూరి జనార్థన్‌, దేవంభట్ల శ్రీనివాసరావు, వాసంశెట్టి కోటేశ్వరరావు, జగన్మోహన్‌రావు, మధిర రూరల్‌ ఎస్‌ఐ రమేష్‌ పాల్గొన్నారు.


Updated Date - 2021-11-10T04:44:42+05:30 IST