పోలియోవాక్సినేషన్‌పై అవగాహన పెంచుకోవాలి

ABN , First Publish Date - 2021-12-31T05:08:18+05:30 IST

డిప్తీరియా, కోరింత దగ్గు, కంఠవాపు, జాతీయ పోలియో వ్యాక్సినేషన్‌ కార్యక్రమంపై గురువారం డీఎంహెచ్‌వో కార్యాలయంలో వైద్య ఆరోగ్య సిబ్బందికి అవగాహన కార్యక్ర మాన్ని నిర్వహించారు.

పోలియోవాక్సినేషన్‌పై అవగాహన పెంచుకోవాలి
మాట్లాడుతున్న జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి

ఖమ్మం కలెక్టరేట్‌, డిసెంబరు 30: డిప్తీరియా, కోరింత దగ్గు, కంఠవాపు, జాతీయ పోలియో వ్యాక్సినేషన్‌ కార్యక్రమంపై గురువారం డీఎంహెచ్‌వో కార్యాలయంలో వైద్య ఆరోగ్య సిబ్బందికి అవగాహన కార్యక్ర మాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అదికారి డాక్టర్‌ బి.మాలతి మాట్లాడుతూ జాతీయ ఇమ్యునైజేషన్‌ డే జనవరిలో నిర్వహించే ఫల్స్‌ పోలియో కార్యక్రమంలో పలు జాగ్రత్తలను చేపట్టాలని సూచించారు. 0-5ఏళ్ల పిల్లలకు విధిగా వ్యాక్సినేషన్‌ చేయాలన్నారు. వచ్చే నెలలో నిర్వహించే ఎన్‌ఐడీ కార్యక్రమాన్ని సిబ్బంది సమిష్టి కృషితో విజయవంతం చేయాలన్నారు. పోలియోరహిత సమాజానికి అంతా కృషి చేయాలన్నారు. శిక్షణ కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి డాక్టర్‌ రాజేష్‌, రాష్ట్ర సర్వేలెన్స్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ ప్రశాంత్‌  డిప్తీరియాకోరింత దగ్డు, కంఠవాపు వంటి వ్యాధుల కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు.  ఈ కార్యక్రమంలో డబ్ల్యూహెచ్‌వో కన్సల్టెంట్‌ డాక్టర్‌ అనూష తో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మెడికల్‌ ఆఫీసర్లు, సూపర్‌వైజర్లు తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-12-31T05:08:18+05:30 IST