అసంక్రమిత వ్యాధుల పట్ల అవగాహన కల్పించాలి

ABN , First Publish Date - 2021-08-22T05:04:46+05:30 IST

అసంక్రమిత వ్యాధులపట్ల అవగాహన కల్పించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ బి మాలతి వైద్యాధికారులను కోరారు.

అసంక్రమిత వ్యాధుల పట్ల అవగాహన కల్పించాలి
మాట్లాడుతున్న డీఎంహెచ్‌వో డాక్టర్‌ మాలతి,

 జిల్లా వైద్యాధికారి మాలతి

ఖమ్మంకలెక్టరేట్‌, ఆగస్టు21: అసంక్రమిత వ్యాధులపట్ల అవగాహన కల్పించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ బి మాలతి వైద్యాధికారులను కోరారు. ప్రోగ్రాం ఆఫీసర్‌ డాక్టర్‌ కె కోటిరత్నం, డీఎస్‌వో డాక్టర్‌ రాజేష్‌తో కలిసి శనివారం డీఎంహెచ్‌వో కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లాలోని వైద్యాధికారులు, స్టాఫ్‌నర్సులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ బీపీ, చెక్కెరవ్యాధి, నోరు, బ్రెస్ట్‌, గర్భకోశ ముఖద్వార క్యాన్సర్లపై అవగాహన పెంపొందించుకుని ప్రజలకు కూడా వీటిపై చైతన్యం కల్పించాలన్నారు. ఎన్‌సీడీ వ్యాధులు చాపకింద నీరులాగా వ్యాపిస్తున్నాయని జీవనశైలి విధానం, మార్పులు వలన కలిగే వ్యాధులని క్షేత్రస్థాయిలో స్ర్కీనింగ్‌ను త్వరితగతిన పూర్తిచేసి వ్యాధిగ్రస్తులను గుర్తించి చికిత్సలను అందించేలా చూడాలని కోరారు. టెలీమెడిసిన్‌ పట్ల క్షేత్రస్థాయిలో ఆశాలు, ఏఎన్‌ఎం ల ద్వారా అవగాహన కల్పించాలని డీఎంహెచ్‌వో ఆదేశించారు. ఈ సందర్భంగా ఎన్‌సీడీ ప్రోగ్రాం పై డాక్టర్‌ సురేష్‌, డాక్టర్‌ చందన , డాక్టర్‌ శివంజిలిన్‌, డాక్టర్‌ సుచరిత, బి వెంకట్‌ ప్రోగ్రాం కో ఆర్డినేటర్‌ ఎన్‌ సఽత్యనారాయణ, వేణుతో తదితరులు పాల్గొన్నారు.  


Updated Date - 2021-08-22T05:04:46+05:30 IST