దంచికొట్టిన వాన
ABN , First Publish Date - 2021-09-04T04:58:31+05:30 IST
దట్టంగా మేఘాలు.. చినుకులతో ప్రారంభమైన వర్షం.. భారీ వర్షంగా మారింది. దానికి ఉరుములు, మెరుపులు తోడయ్యాయి.

వర్షానికి తోడు ఉరుములు, మెరుపులు
పొంగిపొర్లిన వాగులు, వంకలు
లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం
వరద పోటెత్తి స్తంభించిన జనజీవనం
అశ్వాపురం/ మణుగూరు/ ఆళ్లపల్లి సెప్టెంబరు 3: దట్టంగా మేఘాలు.. చినుకులతో ప్రారంభమైన వర్షం.. భారీ వర్షంగా మారింది. దానికి ఉరుములు, మెరుపులు తోడయ్యాయి. వర్షం ధాటికి వాగులు, వంకలు పొంగిపొ ర్లాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది.
ఫఅశ్వాపురం మండలంలో శుక్రవారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. భారీ వర్షంతో పలు గ్రామాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లాయి, వాగులు వంకలు పొంగటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వెంకటాపురం-సాయిబులగుంపు మధ్య, తుమ్మలచెరువు- వెంకటాపురం మధ్య లోతువాగు ఉధృతంగా ప్రవహించటంతో ఆయా గ్రామాల మధ్య రాకపోకలకు కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది, లోతు వాగు ప్రవహించటంతో తుమ్మలచెరువులోకి భారీగా వరదనీరు చేరింది.
ఫ మణుగూరు లో శుక్రవారం సాయంత్రం ఆకస్మాత్తుగా భారీ వర్షం కురిసింది దాదాపు రెండు గంటల పాటు కురిసిన వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. కాలువలు పొంగి పొర్లాయి. లోత ట్టు ప్రాంతాల్లోకి వాన నీరు చేరింది. వరద పోటెత్తడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది తలెత్తింది. భారీ వర్షం పట్ల మండల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియాలోని ఓబీ గనుల్లో బొగ్గు ఎగుమతులకు కొంత అంతరాయం ఏర్పడింది.
ఫ ఆళ్లపల్లి మండలంలోని పలు ప్రాంతాల్లో శుక్రవా రం తెల్లవారుజామున ఉరుములు, పిడుగులతో భారీవర్షం కురిసింది. రెండు గంటలకు పైగా కురిసిన భారీ వర్షానికి జల్లేరు, కోడేల వాగులు ఉధృతంగా ప్రవహించగా, పలు చెరువులు నిండి అలుగులు పోస్తున్నాయి. ఈ ఏడాది ఇదే అతి భారీ వర్షమని రైతులు అంటున్నారు. పిడుగు పా టుకు మర్కోడులోని ఐదు మినీ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు, ఇంట్లో విద్యుత్ గృహపరికరాలు మరమ్మతులకు గుర య్యాయి. మర్కోడులోని బీఎస్‌ఎన్‌ఎల్ టవర్‌కు విద్యుత్ సరఫరా అయ్యే ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోవడంతో సేవలు నిలిచిపోయాయి. దాంతో విద్యుత్ అధికారులు మరమ్మతు లు చేసి సరఫరాను పునరుద్ధరించారు.