పెద్దగొల్లగూడెంలో క్షుద్రపూజల కలకలం

ABN , First Publish Date - 2021-03-23T05:12:33+05:30 IST

మండలంలోని పెద్దల్లగూడెంలో ఆదివారం రాత్రి కొందరు మాంత్రికులు క్షుద్రపూజలు చేస్తున్నారనే వార్త గ్రామంలో కలంకలం సృష్టించింది.

పెద్దగొల్లగూడెంలో క్షుద్రపూజల కలకలం
గ్రామస్థులు నిర్బందించిన వృద్ధుడు,

 పూజకోసం వచ్చిన వారిని   నిర్బంధించిన గ్రామస్థులు

అశ్వారావుపేట, మార్చి22: మండలంలోని పెద్దల్లగూడెంలో ఆదివారం రాత్రి కొందరు మాంత్రికులు క్షుద్రపూజలు చేస్తున్నారనే వార్త గ్రామంలో కలంకలం సృష్టించింది. సమాచారం అందుకున్న గ్రామస్థులు పూజలకోసం వచ్చిన వ్యక్తులను అదుపులోకి తీసుకొని నిర్బందించారు. ఆదివారం రాత్రి ఇద్దరు పెద్దగొల్లగూడెం గ్రామ శివారులోని చెరువుకట్టపైన క్షుద్ర పూజలు చేసేందుకు పందిపిల్లను, కొన్ని రకాల పూజాసామగ్రిని తీసుకొని వచ్చారు. దీనిని గమనించిన గ్రామస్థులు వారిని పట్టుకొని గ్రామంలోకి తీసుకొచ్చి బంధించారు. పూజ చేయడానికి వచ్చిన వ్యక్తులను ప్రశ్నించారు తమ కుమారుడికి జ్వరం వచ్చిందని, దెయ్యం పట్టిందని అందుకే పూజలు చేయడానికి వచ్చామంటూ అసందర్భమైన సమాధానం చెప్పడంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనాస్థలానికి వచ్చి వారిని అదుపులోకి తీసుకొన్నారు. ఎస్‌ఐ వరుణ్‌ ప్రసాద్‌ ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు.

Updated Date - 2021-03-23T05:12:33+05:30 IST