పెండింగ్‌ కేసుల్లో పురోగతి సాధించాలి

ABN , First Publish Date - 2021-11-09T06:17:00+05:30 IST

నిరంతర పర్యవేక్షణ ద్వారా పెండింగ్‌ కేసుల్లో పురోగతి సాదించాలని రాష్ట్ర డీజీపీ యం.మహిందర్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల సీపీలు, ఎస్పీలతో సోమవారం విడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నెలవారి సమిక్ష సమావేశం నిర్వహించారు.

పెండింగ్‌ కేసుల్లో పురోగతి సాధించాలి

వీడియో కన్ఫరెన్స్‌లో డీజీపీ మహేందర్‌రెడ్డి
ఖమ్మం క్రైం, నవంబరు 8:
నిరంతర పర్యవేక్షణ ద్వారా పెండింగ్‌ కేసుల్లో పురోగతి సాదించాలని రాష్ట్ర డీజీపీ యం.మహిందర్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల సీపీలు, ఎస్పీలతో సోమవారం విడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నెలవారి సమిక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా డీజీపీ యం.మహిందర్‌రెడ్డి మాట్లాడుతూ దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించి వెంటనే వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకొవడంలో సత్పలితాలు సాదించాలని అన్నారు.పెండింగ్‌ కేసులను ఎప్పటికప్పుడు సమిక్షించడం ద్వారా కేసుల సంఖ్య తగ్గించే దిశగా అన్ని స్థాయిల పోలీస్‌ అధికారులు కృషి చేస్తున్నారన్నారు. నకిలి ఫోన్‌ నంబర్లు ఉపయోగించి బహుమతులు, ఆఫర్లు అంటూ రోజుకో తరహ మోసం చేసే కేటుగాళ్ళ గురించి ఎంత అవగాహన ఉన్నా చాలామంది సైబర్‌ నేరగాళ్ళ మాయలో పడుతున్నారని, సైబర్‌ నేరాలకు చెక్‌ పెట్టేందుకు యంత్రాంగం సాంకేతికతను సద్విరియోగం చేసుకుని నేరాలకు చెక్‌ పెట్టాలని అన్నారు. ఫంక్షనల్‌ వర్టికల్స్‌ అమలులో అధికారులు, సిబ్బంది, ఉత్తమ ఫలితాలు సాదించాలని అందుకు అవసరమైన శిక్షణ తరగతులు తీసుకోవాలని సూచించారు. అదేవిదంగా శాఖపరమైన పెండింగ్‌ ఓరల్‌ ఎంక్వరీలను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. అనంతరం జిల్లాలో తీసుకుంటున్న చర్యలు గురించి పోలీస్‌ కమిషనర్‌ విష్ణు ఎస్‌ వారియర్‌ డీజీపీకు వివరించారు. ఈకార్యక్రమంలో డీసీపీ ఇంజారపు పూజ, ఏడీసీపీ సుభాష్‌ చంద్రబొస్‌, ప్రసాద్‌, ఏసీపీ ప్రసన్న కుమార్‌, భస్వారెడ్డి, సీఐలు గోపి, సాంభరాజు, ఏవో అక్తురూనిసాబేగం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-09T06:17:00+05:30 IST