ప్రజావాణి.. వినేవారేరీ?

ABN , First Publish Date - 2021-02-02T03:55:35+05:30 IST

ప్రజావాణి సమస్యల పరిష్కారానికి ఎంతో దోహదం చేస్తుంది.

ప్రజావాణి.. వినేవారేరీ?
ఫిర్యాదులు స్వీకరిస్తున్న జిల్లా అధికారులు

 ప్రజాఫిర్యాదులకు కానరాని ప్రాధాన్యత

ఫిర్యాదులను స్వీకరించిన 

అదనపు కలెక్టర్‌ డీఆర్వో

ఖమ్మం కలెక్టరేట్‌, ఫిబ్రవరి1: ప్రజావాణి సమస్యల పరిష్కారానికి ఎంతో దోహదం చేస్తుంది. సోమవారం వచ్చిందంటే చాలు తమ ఇబ్బందులను ఏకరువు పెట్టేందుకు ప్రభుత్వ కార్యాలయాలకు ప్రజలు బారులు తీరుతున్నారు. అపరిష్కృతంగా ఉన్న సమస్యలను జిల్లా ప్రధాన కేంద్రంలో నిర్వహించే ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తే పరిష్కారం అవుతుందని డిమాండ్‌తో ఇక్కడికి పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఇక్కవ పిర్యాదు చేస్తు తమ సమస్యకు శాశ్వతంగా పరిష్కారం లభిస్తుందని గంపెడాశతో వచ్చే ప్రజలకు జిల్లా అధికారులు ఆ భరోసాను కల్పించలేక పోతున్నారు. దీంతో ప్రజావాణి కార్యక్రమంపై ఆశలు సన్నగిల్లుతున్నాయి.

వారానికొకరు ఫిర్యాదుల స్వీకరణ

జిల్లా ప్రధాన కేంద్రమైన ఖమ్మంలోని జడ్పీ సమావేశ మందిరంలో ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.పదేళ్లుగా ఈ కార్యక్రమం జరుగుతుంది. కానీ కరోనా నేపథ్యంలో తాత్కాలికంగా నిలిపి వేసి పునః ప్రారంభం అయినప్పటి నుంచి.. ప్రజావాణి కార్యక్రమం  మెక్కుబడిగా నిర్వహిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక వారం కలెక్టర్‌, మరో వారం డీఆర్వో, మరో వారం అదనపు కలెక్టర్‌, మరో వారం జడ్పీ సీఈవో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు.ఈ నేపథ్యంలో ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు కేవలం శాఖాధిపతులకు అందించి చేతులు దులుపుకుంటున్నారు తప్ప ఆ సమస్య పరిష్కారం అయ్యిందా.. అవ్వకుంటే ఎందుకు అవ్వలేదని ప్రశ్నించే వారు కరువయ్యారని ఆరోపిస్తున్నారు. గతంలో వారం వారం గత వారం అందిన ఫిర్యాదులపై లోతైన సమీక్ష జరిగేది.. కానీ ఇటీవల అసలు సమీక్షే నిర్వహించటం లేదు. దీంతో ప్రజలు దరఖాస్తులు ఇవ్వడమే తప్ప వాటి పరిస్థితి, తిరిగి ఆ సమస్య పరిష్కారం కాకపోవడం వలన కనీసం చెప్పుకోవడానికి కూడా అవకాశం కలగడం లేదని చెబుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ప్రజావాణి నిర్వహణకు అర్థమే లేకుండా పోతుందని విమర్శలు వినిపిస్తున్నాయి. 

ఫిర్యాదులు స్వీకరించిన అదనపు కలెక్టర్‌

 ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్‌ స్నేహలత మెగిలి అధికారులను ఆదేశించారు. సోమవారం జడ్పీ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ప్రజల నుంచి పిర్యాదులను స్వీకరించారు. అధికారులు ప్రజల పిర్యాదులను స్వీకరించడంతో వాటి పరిష్కారానికి కృషిచేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్‌ కార్పొరేషన్‌ కమీషనర్‌ అనురాగ్‌ జయంతి,  డీఆర్వో ఆర్‌ శిరీష, వ్యవసాయశాఖ అధికారి సరిత, సీపీవో కొండపల్లి శ్రీరాం తదితరులు పాల్గొన్నారు. 

ఫిర్యాదుల్లో కొన్ని..

ఫ ఖమ్మం రూరల్‌ మండలం కోటనారాయణపురం ఇందిరమ్మ కాలనీలో అంగన్‌వాడీ, పాఠశాలలకు కేటాయించిన స్థలాలను కొందరు అధికార పార్టీ ముసుగులో  అక్రమంగా ఆక్రమించుకుంటున్నారని కాలనీ వాసులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి అమ్ముకుంటున్న వారి దందాను నిలిపి వేసేందుకు చర్యలు తీసుకోవాలని కె.వెంకట నారాయణ, వి.ఉపేందర్‌, ఎన్‌.నారాయణ, ఎస్‌ వెంకటేశ్వర్లు తదితరులున్నారు.

ఫ సత్తుపల్లి మండలం కిష్టారం ఓపెన్‌ కాస్టుబ్లాస్టింగ్‌ వలన తమ ఇళ్లు దెబ్బతిని కూలిపోయే పరిస్థితిలో ఉన్నాయని తమకు న్యాయం చేయాలంటూ కిష్టారం ఎస్సీ, బీసీ కాలనీ వాసులు దరఖాస్తును అందించారు.

ఫ తన కూతురు87శాతం వికలత్వం ఉందని  పెన్షన్‌ మంజూరి చేయాలని కూసుమంచి మండలం జక్కేపల్లికి చెందిన రాయబారపు ప్రవీణ్‌ ద రఖాస్తు సమర్పించారు. 

Updated Date - 2021-02-02T03:55:35+05:30 IST