ప్రజానాయకుడు పొంగులేటి
ABN , First Publish Date - 2021-10-30T04:08:58+05:30 IST
ప్రజానాయకుడు పొంగులేటి
మాజీ ఎంపీ జన్మదిన వేడుకల్లో బొర్రా రాజశేఖర్, తుంబూరు దయాకర్‌రెడ్డి
ఖమ్మం, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): ఖమ్మం మాజీ ఎంపీ పొంగు లేటి శ్రీనివాసరెడ్డి ప్రజానాయకుడని, ఆయన చేసే సేవా కార్యక్రమాలు ప్రజల మదిలో చిరస్థాయిగా నిలిచిపోతాయని మార్క్‌ఫెడ్ రాష్ట్రచైర్మన్ బొర్రా రాజశేఖర్, పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జ్ తుంబూరు దయాకర్‌రెడ్డి అన్నారు. గురువారం ఖమ్మంలోని క్యాంపు కార్యాలయం లో జరిగిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి పుట్టినరోజు వేడుకల్లో వారు మాట్లాడారు. పదవులతో సంబంధం లేకుండా నిత్యం ప్రజాక్షేత్రంలో ఉండివారి అభివృద్ధికి పాటుపడే నాయకుడు పొంగులేటి అన్నారు. మున్ముందు పొంగులేటికి ఉజ్వల భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రం ప్రగతిపథంలో దూసుకుపో తుందని కొనియాడారు. కాగా పొంగులేటి పుట్టినరోజును పురస్కరించు కుని ఖమ్మం నగరంలో పలు ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమాలు, రక్త దానశిబిరాలు నిర్వహించారు. టీఆర్‌ఎస్ నాయకులు ఖాజా ఆధ్వర్యం లో నిర్వహించిన బైక్ ర్యాలీని దయాకర్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభిం చారు. అనంతరం ఎస్‌ఆర్ కన్వెన్షన్ హాలులో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని జిల్లా రైతు సమన్వయసమితి అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వ రరావు, మార్క్‌ఫెడ్ రాష్ట్ర చైర్మన్ బొర్రా రాజశేఖర్ ప్రారంభించారు. పొంగులేటి పుట్టినరోజు సందర్భంగా సుమారు 250మంది దాతలు రక్తదానం చేశారు. జిల్లా ప్రధాన ఆసుపత్రిలో బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేశారు. తాళ్లూరి రాము ఆధ్వర్యంలో అన్నం ఫౌండేషన్ లో అన్నదానం చేశారు. మిర్చి మార్కెట్ యార్డులో కేవీ చారి ఆధ్వర్యంలో కేక్‌ను కట్ చేశారు. మిషన్ ఆసుపత్రిలో దాసరి రవి ఆధ్వర్యంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. పంపింగ్‌వెల్ రోడ్డులో ఆర్వపల్లి శివకుమార్ ఆధ్వర్యంలో అమ్మ అనాథాశ్రమంలో స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. జలగం రామకృష్ణ ఆధ్వర్యంలో జీవన సంధ్యా వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆయా కార్యక్రమాలో మార్క్‌ఫెడ్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, వైరా మునిసిపల్ చైర్మన్ సూతకాని జైపాల్, వైరా మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మా రోశయ్య, ముదిగొండ జడ్పీటీసీ పసుపులేటి దుర్గా- వెంకట్, కార్పొరేటర్లు దొడ్డా నగేష్, మలీదు జగన్, ఎంపీపీ గోసు మధు, నిరంజన్‌రెడ్డి, ఆకుల మూర్తి, లింగాల రవికుమార్, పద్మజారెడ్డి, దుంపల రవికుమార్, షేక్ హిమామ్, తాళ్లూరి రాము, భూక్యా చంద్రు, కానుగుల రాధాకృష్ణ, పాల నాగేశ్వరరావు, మాధుగాని దుర్గా తదితరులు పాల్గొన్నారు. పొంగులేటి పుట్టినరోజు సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించిన వారందరికీ క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జ్ తుంబూరు దయాకర్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
