పోలీసు అమరవీరులకు శాల్యూట్
ABN , First Publish Date - 2021-02-02T03:57:33+05:30 IST
కొవిడ్ వంటి క్లిష్టపరిస్థితుల్లో సేవలందించి అమరులైన పోలీసులకు శాల్యూట్ అని పోలీసు కమిషనర్ తఫ్సీర్‌ఇక్బాల్ కొనియాడారు.

పోలీసు కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్
ఖమ్మంక్రైం, ఫిబ్రవరి1: కొవిడ్ వంటి క్లిష్టపరిస్థితుల్లో సేవలందించి అమరులైన పోలీసులకు శాల్యూట్ అని పోలీసు కమిషనర్ తఫ్సీర్‌ఇక్బాల్ కొనియాడారు. ఏటా రెండు వారాలపాటు పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో జరిగే సిటీఆర్మ్‌డ్ రిజర్వు పోలీసు సిబ్బంది మొబలైజేషన్ కార్యక్రమాన్ని సోమవారం సీపీ ప్రారంభించారు. ముందుగా సాయుధ ఆర్‌మడ్ సిబ్బందిని నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రమశిక్షణతోపాటు పలు కీలకమైన సమయాల్లో జిల్లా సాయుధ పోలీసులు అందించిన బాధ్యతాయుతమైన సేవలందించారని గుర్తు చేశారు. రాష్ట్రంలోనే మంచి గుర్తింపు సాధించారని కొనియాడారు. మానసికంగా శారీరకంగా ధృడత్వం ఉంటేనే.. బాధ్యతాయుతమైన విధుల నిర్వహణకు దోహదపడుతుందన్నారు. శిక్షణలో అంశాలను మరిచిపోకుండా మరోసారి నివృత్తి చేసుకు నేందుకు దోహదపడే ఈరీప్రెస్ కోర్సు సద్వినియో గించుకోవాలని సూచించారు. 250మంది సాయుధ పోలీసులు పాల్గొనే ఈ శిక్షణ ఫిబ్రవరి 13వరకు కొనసా గుతుందన్నారు. అనంతరం పలువురు సిబ్బందికి జీఎస్‌ఈ రివార్డులు ప్రకించారు. ఈ కార్యక్రమంలో ఏడీసీపీ మాధవరావు, ఏఆర్‌ఏసీపీ విజయ్‌బాబు, ఆర్‌ఐలు రవి, శ్రీనివాస్, సాంబశివరావు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారం కోసం ప్రజాదివస్
ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రతిసోమవారం ప్రజాదివస్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు పోలీసు కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ అన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజాదివస్‌ను ఆయన కార్యాలయంలో నిర్వహించారు. ఫిర్యాదుదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. వచ్చిన ఫిర్యాదులు విచారణ జరిపి పరిష్కారం చూపాలని సంబంధిత ఎస్‌హెచ్‌వోలకు తఫ్సీర్ ఇక్బాల్ ఆదేశించారు.