పోడు భూముల ఆక్రమణను తిప్పికొడతాం

ABN , First Publish Date - 2021-07-09T03:51:49+05:30 IST

పోడు భూముల ఆక్రమణను తిప్పికొడతాం

పోడు భూముల ఆక్రమణను తిప్పికొడతాం
ఎర్రజెండాలతో కొత్తగూడెంలో ప్రదర్శన నిర్వహిస్తున్న పోడురైతులు

అటవీ హక్కుల చట్టానికి తూట్లు పొడుస్తున్న కేసీఆర్‌కు బుద్దిచెప్పాలి 

వామపక్షాల ఆధ్వర్యంలో కొత్తగూడెం జిల్లాకేంద్రంలో ఆందోళన

కలెక్టరేట్‌ను ముట్టడించిన పోడు రైతులు 

కొత్తగూడెం కలెక్టరేట్‌ జూలై 8: దశాబ్ధాలుగా పోడు భూములను సాగుచేసుకొని జీవనం సాగిస్తున్న గిరిజన, గిరిజనేతర పేదల పట్ల రాష్ట్ర ప్రభుత్వం కక్షసాధింపు చర్య లకు పాల్పడుతోందని వామపక్ష నాయకులు ఆరోపించారు. ప్రభుత్వం తన విధానం మార్చుకొని పోడు భూముల నుంచి అటవీశాఖ అధికారులను వెనక్కు పంపాలని, లేని పక్షంలో ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. పోడు భూముల ఆక్రమణను తిప్పికొడతామని పేర్కొ న్నారు. పోడు భూములకు పట్టాలివ్వాలని, 2005 అటవీ హక్కుల చట్టం పకడ్బందీగా అమలుచేయాలని, భూమల ఆక్రమణ, కందకాల తవ్వకాలను నిలిపివేయాలనే డిమాండ్‌తో గురువారం సీపీఐ, సీపీఎం, న్యూడెమోక్రసీ పార్టీల ఆధ్వర్యంలో భద్రాద్రి జిల్లా కేంద్రంలో భారీ ప్రద ర్శన నిర్వహించి కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఈ సందర్భంగా ఎర్రజెండాలతో జిల్లా కేంద్రం ఎరుపెక్కింది. లక్ష్మీదేవిపల్లి మండలం మార్కెట్‌ యార్డు ఆవరణ నుంచి ప్రదర్శన ప్రారంభించి కలెక్టరేట్‌కు కొనసాగించారు. అనం తరం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించి జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ హరిత హారం పేరుతో పోడు భూములను లాక్కు ని పేదలకు ఉరిహారాలు వేస్తే ప్రజలు కేసీఆర్‌కు ఉరేసేందుకు కూడా వెనుకాడ బోరని హెచ్చరించారు. మంత్రులు, ఎమ్మె ల్యేలు కోట్లాది రూపాయల విలువచేసే భూములను కబ్జా చేస్తే ఎలాంటి కేసులు నమోదు చేయని ప్రభుత్వం భూమిలేని నిరుపేదలు పోడు సాగుచేస్తుంటే వారిపై నిర్బంధాలు, పీడీయాక్టు పెట్టి జైలుపాలు చేస్తోందరన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్యెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ ప్రజలు పోరాటాలు, త్యాగాలతో సాధించుకున్న రాష్ట్రాన్ని కేసీఆర్‌కు కట్టబెడితే ప్రజలపైనే పగబట్టి ఇబ్బదులకు గురిచేస్తున్నారని విమ ర్శించారు. మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య మాట్లా డుతూ అనేక పోరాటాలతో సాధించుకొన్న అటవీహక్కుల చట్టానికి కేసీఆర్‌ తూట్లు పొడుస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు పథకం భూస్వా ముల జేబులు నింపుతోందని, బతుకు దెరువుకోసం పోడు సాగు చేస్తున్న రైతులకు ఈ పథకం ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. పొడురైతులపై నిర్బందాలు ప్రయోగిస్తూనే మరో పక్క హారితహారం పేరుతో ఎమ్మెల్యేలు, ఎంపీలు, టీఆర్‌ఎస్‌ నాయకులు అధికారులతో కలిసి పోడు భూముల అన్యాక్రాంతానికి ప్రణాళిక వేస్తున్నారని న్యూడెమోక్రసి రాష్ట్ర నాయకులు ఆవునూరు మధు ఆరోపించారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కె సాబీర్‌పాషా, సీపీఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, న్యూడెమోక్రసి రాష్ట్ర కార్యదర్శి సాధినేని వెంకటేశ్వరరరావు, జిల్లా నాయకులు ముక్తి సత్యం, కిచ్చెల రంగారెడ్డి, ఎల్‌ విశ్వనాధం, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బి అయోద్య, రాష్ట్ర సమితి సభ్యుడు బందెల నర్సయ్య, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కాసాని ఐలయ్య, మచ్చా వెంకటేశ్వరరావు, కొక్కెర్లపాటి పుల్లయ్య గుగులోత్‌ దర్మా, తదితరులు పాల్గొన్నారు. Updated Date - 2021-07-09T03:51:49+05:30 IST