అజ్ఞానపు చీకట్లను తొలగించేదే దీపం..

ABN , First Publish Date - 2021-11-29T04:25:59+05:30 IST

అజ్ఞానపు చీకట్లను తొలగించి దివ్యజ్ఞాన మార్గాన్ని చూపించేది దీపమని ధర్మ పరిరక్షకులు, అధ్యాత్మిక గురు వు పరిపూర్ణానందస్వామి అన్నారు.

అజ్ఞానపు చీకట్లను తొలగించేదే దీపం..
ప్రవచనం చేస్తున్న పరిపూర్ణానంద స్వామి

 లక్ష దీపోత్సవంలో అధ్యాత్మిక గురువు పరిపూర్ణానందస్వామి

కొత్తగూడెం సాంస్కృతికం, నవంబరు 28: అజ్ఞానపు చీకట్లను తొలగించి దివ్యజ్ఞాన మార్గాన్ని చూపించేది దీపమని ధర్మ పరిరక్షకులు, అధ్యాత్మిక గురు వు పరిపూర్ణానందస్వామి అన్నారు. ఆదివారం రాత్రి కొత్తగూడెంలోని ప్రకాశం స్డేడియంలో సామూహిక లక్ష దిపోత్సవ కార్యక్రమాన్ని ఆర్కే చారిటబుల్‌ ట్రస్ట్‌ పౌండర్‌ రంగాకిరణ్‌, ధర్మా జాగరణ సమితి ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహిం చారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిధిగా పరిపూర్ణనందస్వామి హాజరై దీపా న్ని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.  ముందుగా గోవులకు ప్రత్యేక పూ జలు, శివలింగ ప్రాణ ప్రతిష్ట నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ సర్వపాపాలను హరించి ధర్మమార్గాన్ని చూపించేది జ్యోతి అని, దీపపు కాంతులు ప్రపంచ మానవాళికి అజ్ఞానపు అంధకారాన్ని తొలగించే దైవస్వ రూ పమన్నారు. దీపపు వెలుగులతో ప్రకాశం మైదానం కాంతులీనింది. ప్రసరిం చింది. ఈ  కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు పొంగులేటి సుధాకర్‌ రెడ్డి, సింగరేణి డైరెక్టర్‌ బలరాం నాయక్‌,  ప్రముఖ వైద్యులు నాగరాజు, వివిధ అధ్యా త్మిక సంస్థలు, పట్టణ ప్రముఖులు, వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు. కాగా ఈ లక్ష దీపోత్సవ కార్యక్రమానికి  హుజూరాబాద్‌ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయ కులు ఈటెల రాజేందర్‌ హాజరయ్యారు. 


Updated Date - 2021-11-29T04:25:59+05:30 IST