అటవీ ప్రాంతాల్లో కోడి పందేలు

ABN , First Publish Date - 2021-12-31T05:22:56+05:30 IST

అశ్వారావుపేట నియోజకవర్గ పరిసరాల్లో అప్పుడే పండుగ సందడి ప్రారంభమైంది. నియోజకవర్గంలోని పలు మండలాల సరిహద్దుల్లోని అటవీ ప్రాంతం, భద్రాచలం సరిహద్దు అటవీ ప్రాంతంలో నిత్యం ఏదో చోట భారీ ఎత్తున కోడి పందాలు, జూదాలు జరుగుతున్నాయి. ఇక్కడ జరిగే కోడిపందాలు, పేకాటల్లో పాల్గొనేందుకు పక్కనే ఉన్న ఖమ్మం, కృష్ణా, కొత్తగూడెం, భద్రాచలం, పశ్చిమగోదావరి ప్రాంతాల నుంచి పలువురు వస్తున్నారు. నిత్యం మారుమూల అటవీ ప్రాంతాల్లో కోడి పందాలు జరుగుతున్నాయి. పేకాట భారీ ఎత్తున జరుగుతున్నాయి. ప్రతి రోజు రూ.లక్షల్లో సొమ్ము చేతులు మారుతోంది.

అటవీ ప్రాంతాల్లో కోడి పందేలు

అదే స్థాయిలో జూదం, మద్యం వ్యాపారం

రూ. లక్షలు చేతులు మారుతున్న నగదు

పోలీసులకు చిక్కకుండా నిర్వాహకుల ముందుచూపు

సంక్రాంతికి భారీగా కోడిపందేలు నిర్వహించేందుకు ప్రణాళిక

అశ్వారావుపేట, డిసెంబర్‌ 30: అశ్వారావుపేట నియోజకవర్గ పరిసరాల్లో అప్పుడే పండుగ సందడి ప్రారంభమైంది. నియోజకవర్గంలోని పలు మండలాల సరిహద్దుల్లోని అటవీ ప్రాంతం, భద్రాచలం సరిహద్దు అటవీ ప్రాంతంలో నిత్యం ఏదో చోట భారీ ఎత్తున కోడి పందాలు, జూదాలు జరుగుతున్నాయి. ఇక్కడ జరిగే కోడిపందాలు, పేకాటల్లో పాల్గొనేందుకు పక్కనే ఉన్న ఖమ్మం, కృష్ణా, కొత్తగూడెం, భద్రాచలం, పశ్చిమగోదావరి ప్రాంతాల నుంచి పలువురు వస్తున్నారు. నిత్యం మారుమూల అటవీ ప్రాంతాల్లో కోడి పందాలు జరుగుతున్నాయి. పేకాట భారీ ఎత్తున జరుగుతున్నాయి. ప్రతి రోజు రూ.లక్షల్లో సొమ్ము చేతులు మారుతోంది.

ఇటీవల ములకలపల్లి, బూర్గంపహాడ్‌ మండలాల మధ్యలోని అటవీ ప్రాంతంలో భారీగా జరుగుతున్న కోడిపందాలపై అక్కడి పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. ఈ దాడుల్లో పెద్ద ఎత్తున నగదు, కోళ్లు, వాహనాలను అదుపులోకి తీసుకున్నారు. ఈభయంతో జూదరులు పోలీసుల కళ్లు కప్పేందుకు ఎప్పటికప్పుడు ఆటలాడే ప్రదేశాలను మార్చేస్తున్నారు. మొబైల్‌ విధానంలో రోజుకోచోట కోడి పందాలు, పేకాట నిర్వహిస్తున్నారు. దసరా నుంచే కోడి పందేలు ప్రారంభమవగా సంక్రాంతి పండుగ సమీపిస్తున్న కొద్దీ ఊపందుకున్నాయి. పందేలు జరిపే ప్రాంతాల్లో నిర్వాహకులు ప్రత్యేకించి కొందరు వ్యక్తులను కాపలాగా ఉంచుతున్నారు. ఎవరైనా కొత్తవారు ఆ ప్రదేశంలోకి వచ్చిన వెంటనే సెల్‌ఫోన్‌ ద్వారా ఆ సమాచారాన్ని నిర్వాహకులకు చేరవేస్తున్నారు. ఒక వేళ ఆ ప్రాంతంలో ఫోన్‌ సిగ్నళ్లు సరిగ్గా లేకపోతే మోటారు సైకిల్‌పై వెళ్లి సమాచారం ఇస్తారు. సమాచారం అందుకున్న జూదరులు పోలీసులు, ఇతరులెవరైనా ఆ ప్రదేశానికి చేరుకునే సరికి గుట్టుచప్పుడు కాకుండా ఆ ప్రదేశాన్ని ఖాళీ చేసి పక్కకు తప్పుకుంటుంటారు. అలాంటి సమాచార వ్యవస్థను ముందస్తుగా ఏర్పా టు చేసుకోవడం ద్వారా రూ. లక్షల్లో సంపాదిస్తున్నారు. పందాలు, జూదం నిర్వహించే ప్రదేశంలో వారికి అవసరమైన తినుబండారాలు, మద్యం, తాగునీటి వంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు. ప్రతీ ఆటకు ఇంత అని కమీషన్లు వసూలు చేస్తున్నారు. సంక్రాంతి దగ్గరపడుతుండటంతో మరిన్ని పందేలు నిర్వహించేందుకు నిర్వాహకులు అటవీ ప్రాంతంలో నిర్జన ప్రదేశాలను చూసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. 

Updated Date - 2021-12-31T05:22:56+05:30 IST