ఏసీబీకి చిక్కిన జూనియర్ అసిస్టెంట్
ABN , First Publish Date - 2021-03-21T06:49:00+05:30 IST
ఏసీబీ పన్నిన వలలో ఓ జూనియర్ అసిస్టెంట్ చిక్కాడు. శనివారం పాల్వంచ తహ సీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడు లు నిర్వహించి లంచం తీసుకుంటుండగా జూనియర్ అసి స్టెంట్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

పాల్వంచ తహసీల్దార్ కార్యాలయంలో తనిఖీ
రూ.3,500 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ జూనియర్ అసిస్టెంట్
పాల్వంచ రూరల్, మార్చి 20: ఏసీబీ పన్నిన వలలో ఓ జూనియర్ అసిస్టెంట్ చిక్కాడు. శనివారం పాల్వంచ తహ సీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడు లు నిర్వహించి లంచం తీసుకుంటుండగా జూనియర్ అసి స్టెంట్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ మధుసూధన్ కథనం ప్రకా రం పాల్వంచ మండలం పాండురంగా పురం గ్రామానికి చెందిన కోటి అరుణ్ సాయి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసు కున్నాడు. సర్టిఫికెట్ ప్రాధాన్యతను గుర్తించిన జూని యర్ అసిస్టెంట్ ఆనంద్‌మోహన్ చక్రవర్తి దరఖాస్తుదారుడు అరుణ్‌సాయిని డబ్బు డిమాండ్ చేసి తిప్పించ సాగాడు. దీంతో గత్యంతరంలేని పరిస్థితిలో బాధితుడు ఏసీబీని ఆశ్రయిం చాడు. వారిసూచనల మేరకు జూనియర్ అసిస్టెంట్ ఆనం ద్‌కు రూ.3,500లంచం ఇస్తుండగా అప్పటికే ఆఫీసు బయ ట కాపుకాసి ఉన్న ఏసీబీ అఽధికారులు ఆఫీసులోకి ప్రవేశిం చి ఆనంద్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతడి నుం చి రూ.3,500 నగదుస్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేయనున్నట్టు డీఎస్పీ మధుసూధన్ తెలిపారు. తనిఖీలో ఇన్‌స్పెక్టర్ రమణమూర్తి, రవీందర్ పాల్గొన్నారు.