కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి

ABN , First Publish Date - 2021-05-03T04:56:09+05:30 IST

డీసీఎంఎస్‌ ఆధ్వర్యంలో మండలంలోని ముసలిమడుగు, రెబ్బవరం గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే రాములునాయక్‌, డీసీఎంఎస్‌ చైర్మన్‌ రాయల శేషగిరిరావు, వైరా మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గుమ్మా రోశయ్య ప్రారంభించారు.

కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి

 వైరా ఎమ్మెల్యే రాములునాయక్‌, డీసీఎంఎస్‌ చైర్మన్‌ రాయల 

వైరా, మే 2: డీసీఎంఎస్‌ ఆధ్వర్యంలో మండలంలోని ముసలిమడుగు, రెబ్బవరం గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే రాములునాయక్‌, డీసీఎంఎస్‌ చైర్మన్‌ రాయల శేషగిరిరావు, వైరా మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గుమ్మా రోశయ్య ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కేంద్రం కొర్రీలు పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం రైతులు నష్టపోకూడదని ధాన్యం కొనుగోలు చేస్తుందన్నారు. రైతులు దళారులను నమ్మి మోస పోవద్దన్నారు. ప్రభుత్వ మద్దతు ధర పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పసుపులేటి మోహన్‌రావు, మిట్టపల్లి నాగి, చల్లా సతీష్‌, రెబ్బవరం సర్పంచ్‌ సాదం రామారావు, ఎంపీటీసీ రాయ ల రమేష్‌, ఉపసర్పంచ్‌ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-05-03T04:56:09+05:30 IST