ధాన్యం రైతుల దైన్యం

ABN , First Publish Date - 2021-12-26T05:30:00+05:30 IST

వరి కోతలు పూర్తయి నెల దాటింది. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చీ నెల కావొస్తోంది. అయినప్పటికీ కొనుగోళ్ల జాడ లేదు. కొన్నా ఒకటి అరా. దీంతో ధాన్యం రాసుల వద్దే అన్నదాతలు పడిగాపులు కాస్తున్నారు. ఇదేంటని అఽధికారులను అడిగితే తేమ, తాలు అంటూ సాకులు చెబుతున్నారని రైతులు అంటున్నారు. కల్లాల వద్ద ధాన్యాన్ని తూర్బార పట్టినా, కొనుగోలు కేంద్రంలోనూ అదే పని చేయిస్తున్నారని రైతులు అంటున్నారు.

ధాన్యం రైతుల దైన్యం
కేంద్రంలో ధాన్యాన్ని ఆరబోసిన రైతులు

కేంద్రాల్లో మందకొడిగా కొనుగోళ్లు

తేమ, తాలు సాకులు చెబుతున్న అధికారులు

రోజుల తరబడి వడ్ల రాసుల వద్దే పడిగాపులు

ఇబ్బందులుపడుతున్న అన్నదాతలు

ఆధార్‌ అనుసంధానంకాక అవస్థలు

చండ్రుగొండ, డిసెంబరు 26: వరి కోతలు పూర్తయి నెల దాటింది. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చీ నెల కావొస్తోంది. అయినప్పటికీ కొనుగోళ్ల జాడ లేదు. కొన్నా ఒకటి అరా. దీంతో ధాన్యం రాసుల వద్దే అన్నదాతలు పడిగాపులు కాస్తున్నారు. ఇదేంటని అఽధికారులను అడిగితే తేమ, తాలు అంటూ సాకులు చెబుతున్నారని రైతులు అంటున్నారు. కల్లాల వద్ద ధాన్యాన్ని తూర్బార పట్టినా, కొనుగోలు కేంద్రంలోనూ అదే పని చేయిస్తున్నారని రైతులు అంటున్నారు. 

మందకొడిగా..

మండలంలో ధాన్యం కొనుగోలు మందకొడిగా సాగు తున్నాయి. కొన్ని కేంద్రాలలో ఇంకా కొనుగోళ్లు ప్రారంభం కానేలేదు. గానుగపాడు సహకార సంఘం ఆధ్వర్యంలో తిప్పనపల్లి, తుంగారం, రావికంపాడు, పోకలగూడెం గ్రామాల్లో  కేంద్రాలు ప్రారంభమైనా తేమశాతం అధికం గా ఉందంటూ కొనుగోలు చేయడం లేదు. ధాన్యంలో తేమను పరిక్షించటానికే అధివారులు రావడం లేదని కొందరు రైతులు ఆరోపిస్తున్నారు. గుంపెన సొసైటీ పరిధిలో దామరచర్ల, మద్దుకూరులో ఏర్పాటు చేసిన కేంద్రాలలో ఇంకా కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. వ్య వసాయ అధికారులు తేమశాతం పరీక్షించిన తరువాతే కొ నుగోలు కేంద్రాలకు తరలించాలని నిబంధన ఉండటంతో కేంద్రాల వెలుపలే రైతులు ధాన్యాన్ని ఆరబోస్తున్నారు. 

నిబంధనలు కఠినతరం 

నిబంధనలు సైతం కఠినంగానే ఉన్నాయి. ఫోన్‌ నెంబ ర్‌కు ఆధార్‌ అనుసంధానం అయి ఉండాలి, ధాన్యంలో తేమశాతం ముందే పరిశీలించడంతో పాటు రైతులు సాగు చేసిన విస్తీర్ణం వ్యవసాయశాఖ అధికారుల వద్ద ఆన్‌లైన్‌లో నమోదయి ఉండాలి. వీటితో పాటు వ్యవసాయ అధికారుల నుంచి అనుమతి పత్రం పొందిన తరువాతే కొనుగోలు కేంద్రానికి తరలించాలి లాంటి షరు తులు అధికారులు అమలుచేస్తున్నారు. ఇన్ని అవాంతరాల మధ్య ధాన్యం విక్రయం రైతులకు భారంగా మారింది. 

ఆధార్‌ అనుసంధానానికి పరుగులు

ఆధార్‌ అనుసంధానమయితేనే ధాన్యం కొంటామని అ ధికారులు చెబుతుండటంతో పది కిలోమీటర్ల దూరంలో ఉన్న పోకలగూడెంలోని ఆధార్‌ కేంద్రానికి రైతు పరుగులు తీయాల్సి వస్తోంది. మండలంలో సగం మంది రైతుల ఫోన్‌ నెంబర్‌కు ఆధార్‌ అనుసంధానం లేదు. వీరంతా ఆధార్‌ కేంద్రం వద్ద క్యూలైన్‌లో గంటలతరబడి నిరీక్షిం చాల్సి వస్తోంది. మండల కేంద్రంలో ఆధార్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, నిబంధనలు సడలించి కొనుగోళ్లల్లో వేగం పెంచాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. 

జాడలేని ఏఎంసీ, ఐకేపీ

ధాన్యం కొనుగోలు చేయాల్సిన వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ(ఏఎంసీ), మండల మహిళా సమాఖ్య(ఐకేపీ) సంస్థల కొనుగోలుకు ముందుకు రావడం లేదు. గతంలో ఈ రెండు సంస్థలు కొనుగోళ్లు జరిపాయి. కొన్ని సం వత్సరాలుగా ఆ సంస్థలు ముఖం చాటేయటంతో భార మంతా సహకార సంఘాలపైనే పడుతుంది. ధాన్యం మొ త్తం సహకార సంఘాలే కొనుగోలు చేయాలంటే ప్రక్రియ నెలల తరబడి సాగుతోంది. దీంతో రైతులు రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ సమయంలో వర్షాలు కురిస్తే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముంది. రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో ఏఎంసీ, ఐకేపీలు కొనుగోలు చేస్తున్నాయని, ఇక్కడ ఎందుకు కొనుగోలు చేయించరని రైతులు ఉన్నతాధికారులను ప్రశ్నస్తున్నారు.  


Updated Date - 2021-12-26T05:30:00+05:30 IST