దళారులను నమ్మి మోసపోవద్దు

ABN , First Publish Date - 2021-11-10T04:49:48+05:30 IST

దళారులను నమ్మి మోసపోవద్దని, కొనుగోలు కేం ద్రాల్లో మద్దతు ధర లభిస్తుందని పలువురు అధికారు లు, ప్రజాప్రతినిధులు అన్నారు.

దళారులను నమ్మి మోసపోవద్దు
ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభిస్తున్న రేగా కాంతారావు

కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర లభిస్తుంది

కేంద్రాలకు శుభ్రమైన ధాన్యాన్ని తేవాలి 

రైతులకు ప్రజాప్రతినిధులు, అధికారుల సూచన

అన్నపురెడ్డిపల్లి/ బూర్గంపాడు/ మణుగూరు, నవంబరు 9: దళారులను నమ్మి మోసపోవద్దని, కొనుగోలు కేం ద్రాల్లో మద్దతు ధర లభిస్తుందని పలువురు అధికారు లు, ప్రజాప్రతినిధులు అన్నారు. మంగళవారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.

శుభ్రమైన ధాన్యం తీసుకురావాలి

కొనుగోలు కేంద్రాలకు శుభ్రమైన ధాన్యాన్ని తీసుకురా వాలని మండల వ్యవసాయాధికారి అనూష తెలిపారు. మంగళవారం అబ్బుగూడెంలో వానాకాలం ధాన్యం కొనుగోలు ప్రక్రియపై రైతులకు అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు కొనుగోలు కేంద్రాల వద్దకు వచ్చి  ఆరబెట్టడం, తుర్పార పోయడం లాంటివి చేయకుండా క ల్లాల్లోనే ధాన్యాన్ని శుభ్రం చేసి నిర్దేశించిన తేమశాతంతో కేంద్రాలకు తీసురావాలని తెలిపారు. యాసంగిలో అపరా లు, నూనెగింజ పంటలు సాగు చేయాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ కూరం ప్రమీల, రైతుబంధు కో-ఆర్డినేటర్‌ వెంకటేశ్వరరావు,  ఏఈవో సంధ్యారాణి, గుంపెన సహకార సంఘం సిబ్బంది, రైతులు, తదితరులు పాల్గోన్నారు.

దళారులను నమ్మి మోసపోవద్దు

రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత సూచించారు. బూర్గంపాడు మార్కెట్‌యార్డులో ఏర్పాటు చేసిన ధాన్యం కోనుగోలు కేంద్రాన్ని సోమవారం జడ్పీటీసీ, ఏఎంసీ చైర్మ న్‌ పొడియం ముత్యాలమ్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల వద్ద అమ్ముకుని లబ్ధి పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ భగవాన్‌రెడ్డి, ఏఎంసీ సెక్రటరీ నిర్మల, పీఏసీఎస్‌ సీఈవో ప్రసాద్‌, ఏఈవో లలిత పాల్గొన్నారు.

మణుగూరు మండలంలోని  రాజవ్‌గాంధీనగర్‌ ప్రాంతంలోని వ్యవసాయ మార్కెట్‌ కమిటీ గోదాంలో మం గళవారం ఎమ్మెల్యే రేగా కాంతారావు ధాన్యం కొనుగో లు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. రైతులు దళారులను నమ్మి మోస పోవద్దని, కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా అడిషనల్‌ క లెక్టర్‌ క ర్నాటి వెంకటేశ్వరరావు, ఏడీఏ తాతారావు, మా ర్కెట్‌ క మిటీ ఛైర్మన్‌ పొడియం ముత్యాలమ్మ, మార్కెట్‌ కమిటీ సె క్రటరీ విజయనిర్మల, జడ్పీటీసీ పోశం నర్సింహారావు, పీ ఏసీఎస్‌ ఛైర్మన్‌ కుర్రి నాగేశ్వరరావు, సర్పంచ్‌ బచ్చల భార తి, ఉప సర్పంచ్‌ శంకర్‌, నాయకులు ముత్యం బాబు, వ ట్టం రాంబాబు అప్పారావు, మాధవి, రైతులు పోశం సత్యనారాయణ, శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

ఎమ్మెల్యేను కలసిన మిల్లత్‌ కమిటీ సభ్యులు

ఎమ్మెల్యే రేగా కాంతారావును మంగళవారం మణు గూరు నూతన ముస్లిం మిల్లత్‌ కమిటీ సభ్యులు ఇల్ల్లెందు గెస్ట్‌ హౌజ్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే రేగా ముస్లిం పెద్దలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కమిటీ సభ్యులు యూసఫ్‌ షరీఫ్‌, సీరాజ్‌పాషా, నాగుల్‌మీరా, ఇస్మాయిల్‌, రషీద్‌, వహీద్‌, నాయకులు ముత్యం బాబు, అప్పారావు, కుర్రి నాగేశ్వరరావు, రాంబాబు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-10T04:49:48+05:30 IST