రేపటినుంచి ఆపరేషన్‌ స్మైల్‌

ABN , First Publish Date - 2021-12-31T05:10:01+05:30 IST

జనవరి1 నుంచి ఎనిమిదో విడత ఆపరేషన్‌ స్మైల్‌ ప్రారంభం కానుంది. మహిళా శిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోలీసు, కార్మిక, విద్యాశాఖ, చైల్డ్‌లైన్‌ తదితర శాఖల సమన్వయం తో నిర్వహించున్న ఈ కార్యక్రమంలో కోసం అధికారులు కసరత్తు పూర్తిచేశారు.

రేపటినుంచి ఆపరేషన్‌ స్మైల్‌

ఖమ్మంఖానాపురం హవేలీ, డిసెంబరు30:  జనవరి1 నుంచి ఎనిమిదో విడత ఆపరేషన్‌ స్మైల్‌ ప్రారంభం కానుంది. మహిళా శిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోలీసు, కార్మిక, విద్యాశాఖ, చైల్డ్‌లైన్‌ తదితర శాఖల సమన్వయం తో నిర్వహించున్న ఈ కార్యక్రమంలో కోసం అధికారులు కసరత్తు పూర్తిచేశారు. అనాథలను బాల కార్మికులను గుర్తించడానికి ప్రభుత్వం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఒకటో తేదీనుంచి 31వ తేదీ వరకుఈ బృందాలు నెల పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఇటుక బట్టీలు, పరిశ్రమలు, దుకాణాలు,మెకానిక్‌ షాపులు, ధనికుల ఇళ్లల్లో తనిఖీలు జరిపి బాలకార్మికులను గుర్తిస్తారు. వారికి పునరావాసం కల్పించేలా చర్యలు తీసుకోనున్నారు. గత ఏడాది కరోన కారణంగా డిపార్టుమెంట్‌పరంగా నిర్వహించారు. దీంతో ఈఏడాది ఆపరేషన్‌ స్మైల్‌ కరోన నిబంధనలు సడలించడంతో రెస్క్యూ చేసి వారికి పునరావాసం, విద్యనందించేందుకు అధికారులు సమాయత్తం అవుతున్నారు. 

Updated Date - 2021-12-31T05:10:01+05:30 IST