నూరుశాతం వ్యాక్సినేషన్‌ పూర్తిచేయాలి

ABN , First Publish Date - 2021-12-08T05:14:40+05:30 IST

ఈ నెల చివరినాటికి వ్యాక్సినేషన్‌ పూర్తిచేయాలని కలెక్టర్‌ గౌతమ్‌ అధికారులను ఆదేశించారు.

నూరుశాతం వ్యాక్సినేషన్‌ పూర్తిచేయాలి
మండలకేంద్రంలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌

కారేపల్లి మండలంలో కలెక్టర్‌ విస్తృత పర్యటన

 విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పలువురికి షోకాజు నోటీసులు 

కారేపల్లి డిసెంబరు7: ఈ నెల చివరినాటికి వ్యాక్సినేషన్‌ పూర్తిచేయాలని కలెక్టర్‌ గౌతమ్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన కారేపల్లి మండలంలో విస్తృతంగా పర్యటించారు. మండల కేంద్రలోని ఫారెస్టు కార్యాలయంలో జరుగుతున్న వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని పరిశీలించారు.ఆయన మాట్లాడుతూ ఈ నెల చివరికల్ల వ్యాక్సినేషన్‌ కార్యక్రమం పూర్తిచేయాలన్నారు. అక్కడనుంచి బాగ్యనగర్‌తండాలో జరుగుతున్న వ్యాక్సినేషన్‌ కార్యక్రమం పరిశీలించారు. అనంతరం వాణిజ్యపంటలసాగుపై రైతులకు అవగాహన కల్పించేందుకు సమావేశం ఏర్పాటు చేయాలని ముందస్తు సమాచారం ఉన్నప్పటికి కలెక్టర్‌ వచ్చేసరికి కొద్దిమంది రైతులు మాత్రమే ఉండటంతో పాటు అంగన్వవాడి కార్యకర్తలు ఎక్కువగా కనిపించడంతో ఏవో ఉమమాహేశ్వరరావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు లేకుండ అంగనవాడి కార్యకర్తలు ఎందుకు అంటు నిలతీశారు. ఏవో, ఏఈవోలకు షోకాజ్‌ నోటీసులు జారిచేయాలని ఏడీఏ సరితను  ఆదేశించారు. అక్కడనుంచి పల్లెప్రకృతి వనం పరిశీలించారు. అనంతరం పేరుపల్లి పంచాయతీకి వెళ్తున్న సమయంలో అప్పాయిగూడెం పంచాయతీలోని జిన్నింగ్‌ మిల్లు సమీపంలో రోడ్డుకు ఇరువైపుల హరితహారం మొక్కలు కనిపించకపోవడంతో ఎంపీడీవో జమలారెడ్డిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. స్థానిక సర్పంచ్‌ అజ్మీర అరుణ, కార్యదర్శి నాగలక్ష్మీ లకు షోకాజ్‌ నోటీసులు జారీచేయాలన్నారు. పేరుపల్లి గ్రామంలో ప్రత్యామ్నాయ పంటలను సాగుచేయాలన్నారు. మండల కేంద్రంలో ప్రభుత్వస్థలంలో మరుగుదోడ్లు ఏర్పాటుచేయాలని స్థానికులు కలెక్టర్‌ దృష్టికి తీసుకవచ్చారు. అలాగే ప్రభుత్వ ఉన్నతపాఠశాల స్థలం అక్రమణకు గురిఅవుతుందని చెప్పడంతో తహసీల్దార రవికుమార్‌ను పరిశీలించమన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్‌మాలతి, స్థానిక వైద్యులు హనుమంతరావు, చందన, ఎంపీవో రాజారావు, సర్పంచ్‌లు స్రవంతి, సుజాత, నాగేశ్వరరావు, ఎస్‌ఐ కుష్‌ కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-12-08T05:14:40+05:30 IST