ఆయిల్‌పాం సాగుతో అన్నదాతకు ఆర్థిక భరోసా
ABN , First Publish Date - 2021-12-31T05:21:52+05:30 IST
ఆయిల్‌పాం సాగుతో అన్నదాతకు ఆర్థిక భరోసా ఉంటుందని అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ ఎం.మాధవి అన్నారు.

అశ్వారావుపేట రూరల్, డిసెంబరు 30: ఆయిల్‌పాం సాగుతో అన్నదాతకు ఆర్థిక భరోసా ఉంటుందని అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ ఎం.మాధవి అన్నారు. వ్యవసాయ కళాశాలలో గురువారం ఎస్సీ ఉప ప్రణాళిక 2020-2021 కింద రైతులకు ఆయిల్‌ఫాం సాగు- గెలల కోతపై శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. కళాశాల డీన్ డాక్టర్ ఐవీ. శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగిన శిక్షణా కార్యక్రమంలో అసోసియేట్ డీన్ మాధవి మాట్లాడుతూ పామాయిల్ పంట దీర్ఘకాలం పాటు ఆదాయం ఇచ్చే పంట అన్నారు. పామాయిల్‌లో అంతర పంటలతో అదనపు ఆదాయం పొందవచ్చన్నారు. పక్వానికి వచ్చిన గెలలనే కోయాలని తెలిపారు. తద్వారా ఆయిల్ శాతం పెరుగుతుందన్నారు. రైతులు నూతన పద్ధతుల్లో వ్యవసాయం చేయటం ద్వారా లాభాలు పొందవచ్చన్నారు. శిక్షణా తరగతుల్లో డీన్ గోపాలకృష్ణమూర్తి, నీలిమ, ప్రియదర్శిని పాల్గొన్నారు.