సార్‌కు నివాళి..

ABN , First Publish Date - 2021-06-22T05:10:45+05:30 IST

సార్‌కు నివాళి..

సార్‌కు నివాళి..
ధంసలాపురం వద్ద జయశంకర్‌ విగ్రహానికి నివాళులు అర్పిస్తున్న మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌

తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ వర్ధంతి సందర్భంగా సోమవారం రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఖమ్మం ధంసలాపురం వంతెన సమీపంలోని సార్‌ విగ్రహం వద్ద కలెక్టర్‌ ఆర్వీకర్ణన్‌తో కలిసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సార్‌ చూపిన బాటలో నడుస్తున్న తమ ప్రభుత్వం.. రాష్ట్రాన్ని బంగాలు తెలంగాణ దిశగా తీసుకెళుతోందన్నారు. ఇక ఉమ్మడిజిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలు, పలు సంఘాల ఆధ్వర్యంలో జయశంకర్‌ జయంతి కార్యక్రమాలను నిర్వహించారు. ప్రొఫెసర్‌ సేవలను స్మరించుకున్నారు. 

Updated Date - 2021-06-22T05:10:45+05:30 IST