ఆర్థిక ఇబ్బందులతో విలేకరి ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-02-07T05:22:45+05:30 IST
ఆర్థిక ఇబ్బందులతో ఓ విలేకరి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈసంఘటన కొణిజర్ల మండలం భస్వాపురంలో శనివారం జరిగింది.

కొణిజర్ల, ఫిబ్రవరి 6: ఆర్థిక ఇబ్బందులతో ఓ విలేకరి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈసంఘటన కొణిజర్ల మండలం భస్వాపురంలో శనివారం జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాల ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన వింజం సుధీర్‌కుమార్(28) ఓచానల్‌లో విలేకరిగా పని చేస్తున్నాడు. మరోవైపు వ్యవసాయపనులు చేస్తుంటాడు. తండ్రికి తోడుగా ఉంటూ చేస్తున్న వ్యవసాయంలో పంటలు సరిగా పండకపోవడం, అప్పులుకావడం, ఇటీవల ట్రాక్టర్‌ను కూడా తీసుకోవడంతో మరింత ఆర్థికభారమైంది. దాంతో మనస్థాపానికి గురై గ్రామ సమీపంలోని మేజర్‌కాల్వ దగ్గర సత్యనారాయణ అనే రైతు పొలం దగ్గరలో పురుగులమందు తా గాడు. తాగిన విషయాన్ని తన అన్నకు ఫోన్ ద్వారా తెలిపాడు. తను అందుబాటులో లేకపోవడంతో బంధువును అక్కడకు పంపించాడు. అప్పటికే స్పృహతప్పి పడిపోయి ఉన్న సుధీర్‌కుమార్‌ను స్థానికుల సహాయంతో ఖమ్మం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందిన్నట్లు తెలిపారు. సుధీర్‌కుమార్‌కు భార్య త్రివేణి, మూడున్నర, ఏడాదిన్నర కుమారులు ఉన్నారు. సోదరుడు సతీష్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎ్‌సఐ పేర్కొన్నారు. సుధీర్‌కుమార్ నేత్రాలను కుటుంబసభ్యులు ఖమ్మంనేత్ర నిధికి అందజేశారు.