దోచిపెట్టేందుకే నూతన సాగు చట్టాలు
ABN , First Publish Date - 2021-02-07T05:26:37+05:30 IST
రైతుల శ్రమను బడా కంపెనీలకు, దళారీ వ్యవస్థకు దోచిపెట్టేందుకే కేంద్ర ప్రభుత్వం నూతన సాగు చట్టాలను తీసుకొచ్చిందని, రైతుల ఆకాంక్షలకు విరుద్ధంగా కేంద్రం నిర్ణయాలు తీసుకోవడాన్ని దేశ పౌరులుగా ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని వామపక్షాలు, విపక్షాల జిల్లా నేతలు పిలుపునిచ్చారు.

కేంద్రం మొండి వైఖరి వీడాలి
వామపక్షాలు, విపక్షాల జిల్లా నేతలు
కొత్తగూడెం, ఫిబ్రవరి 6: రైతుల శ్రమను బడా కంపెనీలకు, దళారీ వ్యవస్థకు దోచిపెట్టేందుకే కేంద్ర ప్రభుత్వం నూతన సాగు చట్టాలను తీసుకొచ్చిందని, రైతుల ఆకాంక్షలకు విరుద్ధంగా కేంద్రం నిర్ణయాలు తీసుకోవడాన్ని దేశ పౌరులుగా ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని వామపక్షాలు, విపక్షాల జిల్లా నేతలు పిలుపునిచ్చారు. కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ సాగు చట్టాలు, వ్యవసాయోత్పత్తులకు గిట్టుబాటు ధర చట్టబద్ధ హక్కు చట్టం చేయాలని, కేంద్ర విద్యుత్ సంస్కరణల చట్టాన్ని ఉపసంహరించుకోవాలని, రైతు డిమాండ్ల పరిష్కారంలో కేంద్రం ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ ఏఐకేఎ్‌ససీసీ జాతీయ కమిటీ పిలుపులో భాగంగా శనివారం చుంచుపల్లి మండలం పెనగడప గ్రామ సెంటర్ జాతీయ రహదారిపై వామపక్షాలు, విపక్షాలు, రైతు సంఘాల జిల్లా నేతలు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో నేతలు మాట్లాడుతూ సాగు చట్టాల రద్దు విషయంలో కేంద్రం మొండిగా వ్యవహరిస్తోందన్నారు. శాంతియుత ఉద్యమాలతోనే సరిపెట్టుకోబోమని, కేంద్రం దిగి రాకుంటే ప్రతిఘటన ఉద్యమాలు తప్పవని, అవసరమైతే పాలన స్తంభింపజేసైనా రైతు వ్యతిరేక చట్టాలను రద్దుచేయించుకుంటామని పునరుద్ఘాటించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కే సాబిర్‌పాషా, సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు అన్నవరపు సత్యనారాయణ, కాంగ్రెస్ జిల్లా నాయకుడు ఎడవల్లి కృష్ణ, న్యూడెమోక్రసీ జిల్లా నాయకుడు పి. సతీష్, టీజేఎస్ జిల్లా నాయకుడు మల్లెల రామనాథం, టీడీపీ జిల్లా నాయకుడు వారధి సత్యనారాయణ సభలో మాట్లాడారు. కార్యక్రమంలో సీపీఐ కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథం, గుత్తుల సత్యనారాయణ, బందెల నర్సయ్య, వై. శ్రీనివాసరెడ్డి, జిల్లా సమితి సభ్యులు వీసంశెట్టి పూర్ణచందర్‌రావు, భూక్యా దస్రు, జమలయ్య, గార్లపాటి రామనాథం, కొమారి హన్మంతరావు, జడ శ్రీను, ఉప్పుశెట్టి రాహుల్, బొర్రా కేశవులు, జి. వీరస్వామి, వట్టికొండ మల్లికార్జున్, నీడాల సుధాకర్, రత్నకుమారి, సీపీఎం నాయకులు భూక్యా రమేష్, దొడ్డ రవికుమార్, కొండపల్లి శ్రీధర్, నరేష్, లక్ష్మీ, నాగరాజు, కాంగ్రెస్ నాయకులు నాగ సీతారాములు, కాలం నాగభూషణం, తోట దేవిప్రసన్న, న్యూడెమోక్రసీ నాయకులు మాచర్ల సత్యం, ఎం. చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.