ఇంత నిర్లక్ష్యమా?

ABN , First Publish Date - 2021-12-19T06:21:33+05:30 IST

ఇంత నిర్లక్ష్యమా?

ఇంత నిర్లక్ష్యమా?

భద్రాద్రి గిరిజన బీఈడీ కళాశాలకు పొంచి ఉన్నముప్పు 

‘కేయూ’కు సమర్పించని కీలక ధ్రువీకరణ పత్రాలు

మూడు రోజుల్లో సమర్పించకపోతే విద్యా సంవత్సరానికి ఇబ్బందులే

17న ఐటీడీఏ పీవోకు లేఖ రాసిన కేయూ డీన్‌

భద్రాచలం, డిసెంబరు 18: గిరిజన యువత ఉపాఽ ద్యాయ విద్యను అభ్యసించేందుకు ఏర్పాటు చేసిన గిరిజన బీఈడీ కళాశాల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ఈ కళా శాలకు సంబంధించి కీలకమైన ధ్రువీకరణ పత్రాలు దాఖ లు చేసేందుకు సమయం దాటుతున్నా సమర్పించక పోవ డంతో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భద్రాచలం ఐటీడీఏ పీవోకు కాకతీయ యూని వర్సిటీ కాలేజీ డెవలప్‌మెంటు కౌన్సిల్‌ డీన్‌ లేఖ రాశారు. ఈ లేఖలో ఆయన కళాశాల సమర్పించాల్సిన కీలక ధ్రువీ కరణ పత్రాలను ప్రస్తావిస్తూ ఎన్‌సీటీఈ 2014 మార్గదర్శ కాలకు అనుగుణంగా తప్పకవీటిని సమర్పించాలని సూచిం చారు. ఈ పత్రాలను లేఖ జారీ చేసిన ఐదు రోజుల్లోపు అందజేయాలని, లేదంటే 2021-22 విద్యా సంవత్సరానికి గుర్తింపు ఇవ్వలేమని పేర్కొన్నారు. దీంతో ఈ విషయాన్ని ఐటీడీఏ పీవో పోట్రు గౌతమ్‌, గిరిజన సంక్షేమశాఖ ఉప సంచాలకులు రమాదేవిలు కళాశాల అధికారులతో చర్చిం చివాటిని వెంటనే సమర్పించాలని ఆదేశించినట్లు తెలిసింది.  

ఇక మిగిలింది మూడు రోజులే 

భద్రాచలంలోని బీఈడీ కళాశాల గుర్తింపు కోసం తనిఖీ బృందం ఇటీవల పరిశీలించగా ఈ అంశాలకు సంబందిం చిన సమాచారం కళాశాల పూర్తిస్థాయిలో యూనివర్సిటీకి అందజేయలేదని గుర్తించారు. కళాశాలలో ప్రిన్సిపాల్‌ పోస్టు ఎన్‌సీటీఈ 2014 నిబంధనల ప్రకారం భర్తీ చేయలేదని ఈ పోస్టులో పీహెచ్‌డీ ఉన్న వారే బాధ్యతలు నిర్వహించాలని సూచించారు. అలాగే ఏడుగురు అధ్యాపకులను నియమిం చాలని సూచించారు. ఎన్‌సీటీఈ నుంచి పునరుద్దరించబ డిన గుర్తింపు ధ్రువీకరణ పత్రం సమర్పించాలని శానిటరీ సర్టిఫికెట్‌, ఫైర్‌ సేఫ్టీ సర్టిఫికెట్లు తాజావి అందజేయాలని సూచించారు. ఈ మేరకు పీవోకు ఈనెల 17న లేఖ రాయగా ఇప్పటికే రెండు రోజులు ముగిసిపోవడం ఇంకా మూడు రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో గిరిజన విద్యార్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. నిబంధనల మేరకు అన్ని పత్రాలు సమర్పించి కళాశాల ఉనికిని కాపాడాలని భద్రాచలం ఆదివాసీ సమితి కమిటీ ప్రధాన కార్యదర్శి పాయం రవివర్మ కోరారు. 2018 నుంచి కళాశాలలో పీహెచ్‌డీ అర్హత కలిగిన వారే ప్రిన్సిపాల్‌ చేయాలని, అలాగే అధ్యాపకులను వెంటనే నియమించాలని ఒత్తిడి వస్తున్నట్లు సమాచారం.  

ఆసియాకే తలమానికం

భద్రాచలంలోని గిరిజన బీఈడీ కళా శాల 2000సంవత్సరంలో స్థాపించారు. అప్పటి ఖమ్మం జిల్లా కలెక్టర్‌ గిరిధర్‌, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ప్రవీణ్‌ ప్రకాష్‌, కాకతీయ యూనివర్సిటీ డీన్‌ ఘంటా రమేష్‌, అప్పటి డీఈవో సాంబ మూర్తి ప్రత్యేక చొరవతో ఈ కళాశాల ఏర్పాటుకు మార్గం సుగమమైంది. అనం తరం భద్రాచలం ఐటీడీఏ పీవోగా బాధ్య తలు నిర్వహించిన డాక్టర్‌ బుద్ద ప్రకాష్‌ జ్యోతి, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు గిరిధర్‌,శశిభూషణ్‌కుమార్‌ కళాశాలకు పక్కా భవన నిర్మాణం కోసం రూ.రెండు కోట్లు మంజూరు చేశారు. అలాగే కళా శాలకు కేయూలో శాశ్వత గుర్తింపు వచ్చేలా చర్యలు తీసుకున్నారు. ఇదే సమయంలో ఎన్‌సీటీఈ గుర్తింపు సైతం తెచ్చారు. అనంతరం వంద సీట్ల నుంచి రెండు వందల సీట్లకు కళాశాల అప్‌గ్రేడ్‌ కాగా ఆసియాలోనే అరుదైన గిరిజన బీఈడీ కళాశాలగా గుర్తింపు పొందింది. 

ధ్రువీకరణ పత్రాలు అందజేస్తాం

రమాదేవి, గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు

కాకతీయ యూనివర్సిటీ అధికారులు అడిగిన ధ్రువీ కరణ పత్రాలు అందజేస్తాం. నూతన విద్యా సంవత్సరంలో కళాశాల సాపీగా సాగేలా చర్యలు తీసుకుంటాం. ఇందు కోసం ఇప్పటికే కళాశాల అధికారులకు సూచనలు చేశాం. 

Updated Date - 2021-12-19T06:21:33+05:30 IST