ఎన్డీ సీనియర్‌ నాయకుడు శ్రీశైలం మృతి

ABN , First Publish Date - 2021-08-28T05:11:28+05:30 IST

మండల పరిధిలోని రామనర్సయ్య నగర్‌ గ్రామానికి చెందిన ఎన్డీ సీనియర్‌ నాయకుడు పొట్లపల్లి శ్రీశైలం(75) శుక్రవారం మృతి చెందారు. ఖమ్మంలోని ప్రవేటు ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచాడు.

ఎన్డీ సీనియర్‌ నాయకుడు శ్రీశైలం మృతి

 కొణిజర్ల మండలంలో రామనర్సయ్యనగర్‌ గ్రామ నిర్మాణానికి పునాది

పొడుకొట్టి పేదలకు పంపిణీ

కొణిజర్ల, ఆగస్టు27: మండల పరిధిలోని రామనర్సయ్య నగర్‌ గ్రామానికి చెందిన ఎన్డీ సీనియర్‌ నాయకుడు పొట్లపల్లి శ్రీశైలం(75) శుక్రవారం మృతి చెందారు. ఖమ్మంలోని ప్రవేటు ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచాడు. మృతదేహాన్ని రామ నర్సయ్య నగర్‌ గ్రామానికి తీసుకొచ్చి ప్రజల దర్శననార్ధం ఉంచారు. రామనర్సయ్య నగర్‌ గ్రామం అంటేనే ఆ వ్యక్తి పేరు గుర్తుకు వస్తుంది. తొలుత కొంత మందితో గ్రామాన్ని ఏర్పాటు చేయడంలో కీలక భూమికి పోషించాడు. పోడు భూముల ఉద్యమానికి ఆ గ్రామంలో పునాది వేశాడు. పోడుభూములను కొట్టి పేదలకు పంచాడు. ఈ సందర్భంగా ఎన్డీ సీనియర్‌ నాయకుడు గుర్రం అచ్చయ్య, కంకణాల అర్జునరావు అధ్యక్షతన సంతాపసభను నిర్వహించారు. ఈ సభలో ఎన్డీ జిల్లా కార్యదర్శి గోకినేపల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 50సంవత్సరాల నుంచి పేదప్రజల అభివృద్ది కోసం, భూమి హక్కు కోసం పోరాడి జైలు జీవితం గడిపిన మహా నాయకుడు శ్రీశైలం అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్డీ జిల్లా నాయకుడు ఆవుల వెంకటేశ్వర్లు, మండల కార్యదర్శి పాశం అప్పారావు, షేక్‌ ఖాసీం, సీపీఎం జిల్లా నాయకులు బొంతు రాంబాబు, భూక్య వీరభద్రం, కొప్పుల కృష్ణయ్య, తాళ్లపల్లి కృష్ణ, కాంగ్రెస్‌ జిల్లా నాయకులు సూరంపల్లి రామారావు, టీఆర్‌ ఎస్‌ రాష్ట్ర నాయుకుడు గోపగాని శంకర్‌రావు, పోగుల శ్రీను, ఆమ్‌ఆద్మి జిల్లా కో కన్వీనర్‌ స్వర్ణ సుబ్బారావు, సర్పంచ్‌ కొర్రా కాంతమ్మ, ప్రముఖ న్యాయవాది కొల్లి సత్యనారాయణ  పాల్గొన్నారు.  

ఖమ్మంమయూరిసెంటర్‌: పోట్లపల్లి శ్రీశైలం మృత దేహన్ని రాయనర్సయ్య విజ్ఞానకేంద్రంలో పార్టీ నాయకుల సందర్శనార్ధం కొద్దిసేపు ఉంచారు. ఈ సందర్భంగా కొందరు నాయకులు నివాళి అర్పించారు. జిల్లా కార్యదర్శి గోకినపల్లి వెంకటేశ్వరరావు, సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు పోతినేని సుదర్శన్‌రావు, బాగం హేమంత రావు, సీపీఎం, సీపీఐ జిల్లా కార్యదర్శులు నున్నా నాగేశ్వర రావు, పోటు ప్రసాద్‌, గుర్రం అచ్చయ్య, టీజేఏసీ నాయ కులు గోపగాని శంకర్‌రావు, ఆవుల వెంకటేశ్వర్లు, అశోక్‌, హనుమంతరావు, రామయ్య, పుల్లయ్య, గిరి, నాగేశ్వరరావు, సక్రు, నందగిరి వెంకటేశ్వర్లు, తదితరులు నివాళులర్పించారు.

Updated Date - 2021-08-28T05:11:28+05:30 IST