ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్‌లో నేడు, రేపు జాతీయసదస్సు

ABN , First Publish Date - 2021-12-28T05:54:29+05:30 IST

నగరంలోని ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్‌ డిగ్రీ కళాశాలలో రెండురోజుల జాతీయసదస్సు నిర్వహిస్తున్నట్టుకళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ మహ్మద్‌జాకీరుల్లా తెలిపారు.

ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్‌లో నేడు, రేపు జాతీయసదస్సు

ఖమ్మంఖానాపురంహవేలి, డిసెంబరు27: నగరంలోని ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్‌ డిగ్రీ కళాశాలలో  రెండురోజుల జాతీయసదస్సు నిర్వహిస్తున్నట్టుకళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ మహ్మద్‌జాకీరుల్లా తెలిపారు. మంగళ, బుధవారాల్లో ది హోలిస్టిక్‌ డెవలప్‌మెంట్‌ దళిత్స్‌ అనే అంశంపై రూసా సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా కేయూ ఉపాధ్యక్షుడు ఆచార్య తాటికొండ రమేష్‌ మాజీ టీపీఎస్సీ చైర్మన్‌ ఆచార్య ఘంటా చక్రపాణి పాల్గొంటారని తెలిపారు. వీరితోపాటు వివిధ విశ్వవిద్యాలయ ఆచార్యులు, డిగ్రీ కళాశాల అధ్యాపకులు పాల్గొని పత్రసమర్పణలు చేస్తారన్నారు. సదస్స కన్వీనర్‌గా డాక్టర్‌ ఎన్‌.గోపి, సమన్వయకర్తలుగా ఎన్‌.వెంకన్న, డాక్టర్‌ సీవీ మురళీదర్‌, డాక్టర్‌ విజయభాస్కరశర్మ వ్యవహరిస్తారని తెలిపారు.

Updated Date - 2021-12-28T05:54:29+05:30 IST