నేలకొండపల్లి కాంగ్రెస్‌లో ముసలం

ABN , First Publish Date - 2021-12-09T05:09:50+05:30 IST

ఏనాడు పార్టీని పట్టించుకోని వారికి పదవులిస్తూ, మొదటి నుంచీ పార్టీలో పని చేస్తున్న వారిని నాయకులు పట్టించుకోవటం లేదని మండల కాంగ్రెస్‌ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నేలకొండపల్లి కాంగ్రెస్‌లో ముసలం
మాట్లాడుతున్న నేలకొండపల్లి సర్పంచ్‌ నవీన్‌

పార్టీని పట్టించుకోని వారికి పదవులంటూ అభ్యంతరం

 మూకుమ్మడిగా పార్టీకి రాజీనామా చేస్తామంటూ హెచ్చరికలు

నేలకొండపల్లి,డిసెంబరు8: ఏనాడు పార్టీని పట్టించుకోని వారికి పదవులిస్తూ, మొదటి నుంచీ పార్టీలో పని చేస్తున్న వారిని నాయకులు పట్టించుకోవటం లేదని మండల కాంగ్రెస్‌ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈమేరకు బుధవారం నేలకొండపల్లి కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో నాయకులు అత్యవసర సమావేశం నిర్వహించారు. సమావేశానికి మండలంలోని సర్పంచ్‌లు, ముఖ్య నాయకులు అందరూ హాజరయ్యారు. సమావేశంలో సర్పంచ్‌, జిల్లా కాంగ్రెస్‌ నాయకుడు రాయపూడి నవీన్‌ మాట్లాడుతూ మొదటి నుంచి పార్టీలో ఉన్న వారికి గుర్తింపు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కొంత మంది రాష్ట్రస్ధాయి నాయకులే మండలాలలో గ్రూపులను సృష్ట్టించి వేడుక చూస్తున్నారన్నారు. మండలంలో ఐక్యంగా సాగుతున్న కాంగ్రెస్‌ పార్టీలో గ్రూపులు పెట్టి భట్టి వేడుక చూస్తున్నారన్నారు. నియోజకవర్గంలో ఇప్పటికే పార్టీకి నాయకులు లేరని, అయినా కార్యకర్తలు పార్టీని కాపాడుకుంటున్నరన్నారు. ఇవే పరిస్ధితులు కొనసాగితే తాము పార్టీలో కొనసాగలేమని, బాధతోనైనా పార్టీని వీడక తప్పదని హెచ్చరించారు. మండల కాంగ్రెస్‌కు అధ్యక్షుడి నియమించినట్లుగా సామాజిక మాధ్యమాల్లో వచ్చిన కఽథనాలతో వారిలో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. పార్టీలో సమర్ధుని, సీనియర్ని నియమించాలని డిమాండ్‌ చేస్తూ అందుకు ఐదుగురి పేర్లను ఎంపిక చేసి పంపారు. సమావేశంలో సర్పంచ్‌లు దొనకొండ రామకృష్ణ, మాగి పుల్లయ్య, బచ్చలకూర మైసయ్య, నేలకొండపల్లి మాజీ సర్పంచ్‌ మామిడి వెంకన్న, మైనారిటీ నాయకుడు షేక్‌.హుస్సేన్‌, మాజీ సర్పంచ్‌లు తేజావత్‌ శివాజి, గండు జానయ్య,  గడ్డ.ం సత్యం, రెడ్డిమళ్ళ బాబురెడ్డి, కుక్కల హనుమంతరావు, పల్లెబోయిన లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

Updated Date - 2021-12-09T05:09:50+05:30 IST