29న సత్తుపల్లి మునిసిపల్ భవనం ప్రారంభం
ABN , First Publish Date - 2021-03-25T04:57:10+05:30 IST
నూతన భవనాల ఏర్పాటుతో పరిపాలన సౌలభ్యంతో పాటు పనులు వేగంగా అందించవచ్చునని ఐటీ, పురపాలక శాఖమంత్రి కేటీఆర్ చెప్పినట్లు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తెలిపారు.

హాజరుకానున్న మంత్రులు కేటీఆర్, పువ్వాడ
ఆహ్వానించిన ఎమ్మెల్యే సండ్ర
సత్తుపల్లి, మార్చి 24: నూతన భవనాల ఏర్పాటుతో పరిపాలన సౌలభ్యంతో పాటు పనులు వేగంగా అందించవచ్చునని ఐటీ, పురపాలక శాఖమంత్రి కేటీఆర్ చెప్పినట్లు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తెలిపారు. రూ.3కోట్ల టీఎస్‌ఎఫ్‌ఐడీసీ నిధులతో నిర్మితమైన నూతన మునిసిపల్ భవన ప్రారంభోత్సవానికి ఈనెల 29న సత్తుపల్లికి రావాలని మునిసిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్ మంత్రులు కేటీఆర్, పువ్వాడలను ఎమ్మెల్యే సండ్రతో బుధవారం హైదరాబాద్‌లో కలసి ఆయన ఆహ్వానించారు. కేసీఆర్ సంకల్పంతోనే పేదలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. పట్టణ అభివృద్ధిలో భాగంగా నూతన భవనంతో పాటు పార్క్‌ల నిర్మాణంతో ఆహ్లాదం పంచేందుకు అర్బన్ పార్క్ పనులు వేగంగా సాగుతుండగా జేవీఆర్ పార్క్ ఆధునికీకరణ పనులు త్వరలోనే పూర్తవ్వనున్నట్లు చైర్మన్‌చెప్పారు. వారితో మునిసిపల్ కమిషనర్ సుజాత, కౌన్సిలర్ చాంద్‌పాష ఉన్నారు.