మల్బరీ సాగు ప్రత్యామ్నాయ లాభాల పంట

ABN , First Publish Date - 2021-12-19T05:50:44+05:30 IST

వరికి ప్రత్యామ్నాయంగా మల్బరీ సాగు చేపట్టి అధిక ఆదాయంతో లాభాలు పొందవచ్చునని కేంద్రీయ సిల్క్‌బోర్డు శాస్త్రవేత్త ప్రవీణ్‌కుమార్‌, జిల్లా సెరీ కల్చర్‌ డిప్యూటీ డైరెక్టర్‌ జి.అనసూయ సూచించారు.

మల్బరీ సాగు ప్రత్యామ్నాయ లాభాల పంట
మాట్లాడుతున్న అనసూయ

సెరీ కల్చర్‌ డిప్యూటీ డైరెక్టర్‌ అనసూయ

వైరా, డిసెంబరు 18: వరికి ప్రత్యామ్నాయంగా మల్బరీ సాగు చేపట్టి అధిక ఆదాయంతో లాభాలు పొందవచ్చునని కేంద్రీయ సిల్క్‌బోర్డు శాస్త్రవేత్త ప్రవీణ్‌కుమార్‌, జిల్లా సెరీ కల్చర్‌ డిప్యూటీ డైరెక్టర్‌ జి.అనసూయ సూచించారు. వైరా మండలం కొండకొడిమ గ్రామంలో శనివారం మల్బరీ తోటల సాగు, పట్టుపురుగుల పెంపకంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ప్రవీణ్‌కుమార్‌, అనసూయ మాట్లాడారు. మల్బరీ తోటల సాగు, పట్టుపురుగుల పెంపకం ద్వారా ఆదాయం సాధిస్తున్న ఆదర్శరైతుల గురించి వివరించారు. సన్న, చిన్నకారు రైతులకు ఇది ఎంతో లాభసాటి అని తెలిపారు. పట్టుపురుగుల పెంప కం షెడ్‌ నిర్మాణానికి జనరల్‌ రైతులకు రూ.2లక్షలు, ఎస్సీ, ఎస్టీ రైతులకు రూ.2.60లక్షలు అలాగే స్ట్రాండ్‌ నిర్మాణం, రోగనిరోధక మందులకు, పట్టుపురుగుల పెంపకం పరికరాలకు రాయితీ లభిస్తుందని వివరించారు. మల్బరీ తోట నాటేందుకు ఇచ్చే రాయితీల గురించి వివరించారు. కొండకొడిమ సర్పంచ్‌ దొంతెబోయిన శ్రీనివాసరావు, రైతుబంధు సమన్వయకర్త వి.వెంకటేశ్వరరావు, పట్టుపరిశ్రమశాఖ అధికారులు పి.సమ్మయ్య, కె.సురేష్‌, కె.శ్రీనివాసరావు, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ సర్వేశ్వరరావు, రైతులు పాల్గొన్నారు.


Updated Date - 2021-12-19T05:50:44+05:30 IST