సిబ్బంది లేక ఇబ్బంది

ABN , First Publish Date - 2021-09-04T04:56:38+05:30 IST

సిబ్బంది డిప్యూటేషన్‌, పోస్టుల ఖాళీలతో దుమ్ముగూడెం మండల ప్రజా పరిషత్‌ కార్యాలయం సతమతమవుతోంది.

సిబ్బంది లేక ఇబ్బంది
మండల పరిషత్‌ కార్యాలయం

డిప్యూటేషన్‌పై వెళ్లిన కీలక ఉద్యోగి
ఖాళీల భర్తీలో సర్కారు మీనమేషాలు
జీతాల బిల్లులు ఓ ఉపాధ్యాయుడితో చేయిస్తున్న దుస్థితి
అభివృద్ధి పనులకు అడ్డంకి
ఇదీ దుమ్ముగూడెం మండల పరిషత్‌ కార్యాలయంలో పరిస్థితి
కలెక్టర్‌ అనుదీప్‌ ఆదేశించినా పురోగతి శూన్యం
దుమ్ముగూడెం, సెప్టెంబరు 3:
సిబ్బంది డిప్యూటేషన్‌, పోస్టుల ఖాళీలతో దుమ్ముగూడెం మండల ప్రజా పరిషత్‌ కార్యాలయం సతమతమవుతోంది. విధి నిర్వహణలో అంత గా అనుభవం లేని ఓ టైపిస్టు, ఇటీవలే బదిలీపై వచ్చిన సూపరింటెండెంట్‌తో కార్యాలయం నిర్వహిస్తున్నారు. ఎంపీడీవో కార్యాలయంలో విధులు నిర్వర్తించాల్సిన ఒక సీనియర్‌ అసిస్టెంట్‌ ఏడాదిగా సీఈవో కార్యాలయానికి డిప్యూటేషన్‌పై వెళ్లడంతో ఇక్కడి కార్యాలయ పనులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా మారాయి. దీంతో మండల అభివృద్ధిపై దృష్టి సారించాల్సిన ఎంపీడీవోపై పని ఒత్తిడి పెరగడంతో, పర్యవేక్షణ కష్టతరంగా మారింది. జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టు ఖాళీ, సీనియర్‌ అసిస్టెంటు డిప్యూటేషన్‌పై విధులు నిర్వర్తించడంతో ఎంపీడీవో కార్యాలయ నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. సర్వసభ్య సమావేశాలు, జీతాల బిల్లులు, రికార్డులు, ఖాతాల నిర్వహణ భారంగా మారింది. మండల పరిషత్‌ కార్యా లయ సిబ్బంది వేతనాల బిల్లులు సైతం ఒక ఉపాధ్యా యుడిపై ఆధారపడి చేయించాల్సిన దుస్థితి నెలకొంది.
జిల్లాలోనే అతి పెద్ద మండలం
దుమ్ముగూడెం మండలం భౌగోళికంగా జిల్లాలోనే అతి పెద్దది. నలభై వేలకు పైగా జనాభా ఉంది. 37 గ్రామ పం చాయతీలు, 99 హ్యాబీటేషన్లు ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం జూనియర్‌ అసిస్టెంటు బదిలీపై వెళ్లగా, పూర్తి భారం విధుల్లో అంతగా అనుభవం లేని టైపిస్టుపై పడింది. ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న సూపరింటెండెంట్‌ పోస్టు ఇటీవల భర్తీ కాగా, ఇంకా పూర్తిస్థాయిలో విధులు నిర్వర్తించడం లేదని తెలుస్తోంది. దీంతో కార్యాలయ నిర్వహణలో సమస్యలు ఉత్పన్నమౌతున్నాయి. అత్యవస రంగా ఉన్నతాధికారులకు పంపాల్సిన నివేదికల తయారీకి మల్లగుల్లాలు పడాల్సి వస్తోంది. ఈజీఎస్‌, మండలాభివృద్ధి పనులను నిత్యం పర్యవేక్షించాల్సిన ఎంపీడీవోకు కార్యాల య నిర్వహణ పెద్ద సవాలుగా మారింది. ప్రతీ నె లా ఎంపీడీవో, ఎంపీవో, పంచాయతీ కార్యదర్శులతోపాటు ము గ్గురు ఆఫీస్‌ సబార్డినేట్లు, టైపిస్టు వేతనాల బిల్లులు ట్రెజ రీకి పంపేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నివేది కల తయారీ, కార్యాలయ నిర్వహణ భారంతో ఒత్తిడి ఎదు ర్కొంటున్న ఎంపీడీవో మండల అభివృద్ధి పనులపై పర్యవేక్షణను పక్కన పెట్టాల్సిన దుస్థితి నెలకొంది.
ఎంపీడీవో కార్యాలయంలో ఉండాల్సిన సీనియర్‌ అసిస్టెంట్‌ ఏడాదిగా సీఈవో కార్యాలయంలో డిప్యూ టేషన్‌పై విధులు నిర్వ ర్తిస్తున్నారు. జిల్లా కార్యాలయానికి సిబ్బంది అవసరమైతే సమీప మండలాల నుంచి డిప్యూ టేషన్‌పై సిబ్బందిని తీసుకుంటే ఇటు మండలానికి, అటు సీఈవో కార్యాలయ విధుల నిర్వహణకు ఎంతో ప్రయో జనకరం. డిప్యూటేషన్‌ సాకుతో మండల పరిషత్‌ సిబ్బం దిలో ఎవరో ఒకరు ఏళ్ల తరబడి బయట ప్రాంతాల్లో పని చేయడం ఇక్కడ సర్వసాధారణంగా మారింది. దీంతో అతి పెద్దదైన దుమ్ముగూడెం మండల పరిషత్‌ కార్యాలయ వి ధులకు ఆటంకం తొలగడం లేదు. ఒక్కోసారి ఎంపీడీవో కూర్చొని స్వయంగా రికార్డులు రాయాల్సిన దుస్థితి నెలకొం ది. ఈ విషయమై ఎంపీడీవో చంద్రమౌళిని ప్రశ్నించగా, కా ర్యాలయ రికార్డుల నిర్వహణ భారంగా మారిందని తె లిపారు. పెద్ద మండలం కావడంతో ఇబ్బంది ఉందని అన్నారు.
కలెక్టర్‌ ఆదేశించినా..
మండల పరిషత్‌ కార్యాలయ నిర్వహణకు సీనియర్‌ అసిస్టెంట్‌ అవసరం ఎంతో ఉందని ఎంపీపీ రేసు లక్ష్మి కలెక్టర్‌ అను దీప్‌కు రెండు నెలల క్రితం స్వయంగా లిఖితపూర్వకంగా తెలిపారు. వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ అక్కడి కక్కడే సంబంధిత అధికారికి ఆదేశాలిచ్చినప్పటికీ, నేటికీ పురోగతి లేదు. ఎంపీడీవో కార్యాలయ పరిస్థితుల దృష్ట్యా సీనియర్‌ అసి స్టెంట్‌ను వెనక్కుపంపడంతోపాటు, జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టును భర్తీ చేసి, మండలాభివృద్దికి సహకరించాలని ఎంపీపీ లక్ష్మి కలెక్టర్‌ను మరో మారు కోరారు.

Updated Date - 2021-09-04T04:56:38+05:30 IST