‘గూడెం’లో ఎంపీ నామ పర్యటన

ABN , First Publish Date - 2021-08-22T04:35:51+05:30 IST

కొత్తగూడెం లో ఖమ్మం పార్లమెంట్‌ సభ్యుడు నామా నాగేశ్వరరావు శనివారం విస్తృతంగా పర్యటించారు.

‘గూడెం’లో ఎంపీ నామ పర్యటన
దేవకృష్ణ కుటుంబాన్ని పరామర్శిస్తున్న నామ

దేవకృష్ణ కుటుంబానికి అండగా ఉంటామని హామీ

కొత్తగూడెం పోస్టాఫీస్‌ సెంటర్‌, ఆగస్టు 21: కొత్తగూడెం లో ఖమ్మం పార్లమెంట్‌ సభ్యుడు నామా నాగేశ్వరరావు శనివారం  విస్తృతంగా పర్యటించారు. ఈ పర్యటనలో రామవరం ప్రాంతానికి చెందిన ప్రముఖ వైద్యుడు వాసిరెడ్డి జగదీష్‌ భౌతికదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పారిశ్రామిక ప్రాంతంలో ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించి ఎందరికో సుపరిచితుడయ్యాడని ఆయన చేసిన సేవలను కొనియాడారు. కరోనాతో మృతి చెందిన సింగరేణి సీనియర్‌ పాత్రికేయుడు రామవరం ప్రాంతానికి చెందిన సముద్రాల దేవకృష్ణ ఇంటికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జరిగిన సంఘటనను దేవకృష్ణ భార్య, కుమారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా దేవకృష్ణ కుటుంబసభ్యులు ఎంపీ నామాకు తమ రోదనను విన్నవించుకున్నారు. ఉండేందుకు నిల్వ నీడ లేదని తన కుటుంబ సభ్యులే వెళ్లిపోమ్మని  బెదిరింపులకు పాల్పడు తూ తమను పంపించారని పిల్లల భవిష్యత్‌ ప్రశ్నార్థంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు సహాయ సహాకారాలు అందించే వారు కరువయ్యారని  తమకు న్యా యం చేసి తమ పిల్లల భవిష్యత్‌కు భరోసా కల్పించాలని కోరారు. సమస్యలను అధికారులు, ప్రజా ప్రతినిధుల దృష్టి కి తీసుకెళ్లి న్యాయం చేయాలని కోరారు. స్పందించిన ఎంపీ నామా మాట్లాడుతూ నామా ముత్తయ్య చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా దేవకృష్ణ కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అదేవిధంగా దేవకృష్ణ కుటుంబ సభ్యుల సమస్యలు పరిష్కరించేలా టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు వనమా రాఘవేందర్‌రావు, కొత్తగూడెం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కాపు సీతాలక్ష్మిని ఆదేశించి కొత్తగూడెం డీఎస్పీ దృష్టికి తీసుకెళ్లి తక్షణం పరిష్కరించేలా చర్యలు చేపట్టనున్నామని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.  ఎంపీ వెంట జడ్పీ వైస్‌ చైర్మన్‌ కంచర్ల చంద్రశేఖర్‌ రావు,  చుంచుపల్లి ఎంపీపీ బాదావత్‌ శాంతి,  కొత్తగూడెం మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ దామో దర్‌, టీబీజీకేఎస్‌ నాయకులు కాపు కృష్ణ, టీఆర్‌ఎస్‌ నాయకులు గుగులోత్‌ కృష్ణ, సిరిమల్లె కుమారస్వామి, న్యాయ వాది మారపాక రమేష్‌,  ఆటో వర్కర్స్‌ యూనియన్‌  రాష్ట్ర నాయకులు కంచర్ల జమలయ్య, దళిత సంఘ నాయకులు గూడెల్లి యాకయ్య,  తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-08-22T04:35:51+05:30 IST