జిల్లా అభివృద్ధికి మరింత కృషి

ABN , First Publish Date - 2021-11-03T04:14:30+05:30 IST

జిల్లాలో సమస్యల పరిష్కారానికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కృషిచేయాలని జిల్లాపరిషత చైర్మన లింగాల కమల్‌రాజ్‌ సూచించారు. మంగళవారం జిల్లాపరిషత

జిల్లా అభివృద్ధికి మరింత కృషి

సమస్యల పరిష్కారానికి చొరవ చూపించాలి

జిల్లాపరిషత సమావేశంలో జడ్పీచైర్మన కమల్‌రాజ్‌, కలెక్టర్‌ వీపీ గౌతమ్‌

ఖమ్మం, నవంబరు 2 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): జిల్లాలో సమస్యల పరిష్కారానికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో  కృషిచేయాలని జిల్లాపరిషత చైర్మన లింగాల కమల్‌రాజ్‌ సూచించారు. మంగళవారం జిల్లాపరిషత సర్వసభ్య సమావేశానికి అధ్యక్షత వహించిన ఆయన మాట్లాడారు. కరోన ప్రభావం వల్ల మూతపడిన విద్యాసంస్థలు ప్రారంభం అయినందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఉపాధ్యాయుల సమస్య లేకుండా చూడాలని డీఈవోకు సూచించారు.  జిల్లా కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ మాట్లాడుతూ విద్యార్థుల హాజరుశాతం పెంచేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు.  సీడీపీ నిధుల ద్వారా ఏటా రూ.2కోట్లు పాఠశాలల్లో సదుపాయాల కల్పనకు వినియోగిస్తామని వివరించారు. ప్రతీ ఏడాది రూ.10కోట్లు పాఠశాలల్లో మౌళిక సదుపాయాలు కల్పనకు ఖర్చుచేస్తున్నట్టు తెలిపారు. జిల్లాలో కొవిడ్‌ వ్యాక్సినేషణ్‌ వేగంగా జరుగుతుందని, ఇప్పటివరకు 8లక్షల69వేల మందికి మొదటిడోసు, 3లక్షల54వేలమందికి రెండోడోసు పూర్తిచేశామన్నారు.  జిల్లాలో ఇంకా లక్షా60వేలమంది టీకా తీసుకోని వారుఉన్నారని, ఓటరు జాబితా ప్రకారం ఇంటింటి సర్వేనిర్వహించి వారికి మొదటి డోసు వేస్తామన్నారు. ఈవిద్యాసంవత్సరానికి 80,974మంది విద్యార్థులకు,5,73,000 ల ఉచిత పాఠ్యపుస్తకాలు పంపిణీచేశామని తెలిపారు. 14కేజీబీవీల్లో 4300మంది విద్యార్థినీలకు విద్యాబోధన జరుగుతోందని, ఈవిద్యాసంవత్సరంలో ఇప్పటివరకు 18,207మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని తెలిపారు.  ఉపాధి హామీ పథకం కింద జిల్లాలో 388వైకుంఠధామాలు, 129రైతువేదికలు, 586సీసీరోడ్లు, పీఎంజీఎస్‌వైకింద 12రహదారులు, నియోజకవర్గ అభివృద్ధి నిధులతో 1,081 అభివృద్ధిపనులు చేపట్టామని పీఆర్‌ ఈఈ వివరించారు.  జడ్పీసీఈవో అప్పారావు, డీసీఎంఎస్‌చైర్మన రాయల శేషగిరిరావు, డీఈవో యాదయ్య, పీఆర్‌ ఈఈ చంద్రమౌళి, ఆర్‌అండ్‌బీ ఇంజనీర్‌ ఽశ్యాంప్రసాద్‌, డీఎంహెచవో మాలతి, బీసీ సంక్షేమ అధికారి జ్యోతి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-11-03T04:14:30+05:30 IST