అమ్మా.. నేను భిక్షాటన చేయలేను!
ABN , First Publish Date - 2021-12-16T05:18:52+05:30 IST
కన్నతల్లి భిక్షమెత్తిస్తుండటంతో ఓ బాలిక ఇంటినుంచి పారిపో యింది. ఇలా ఖమ్మం చేరుకుంది. ఆ బాలికను ఖమ్మం చైల్డ్‌లైన్1098 చేరదీసింది.

హైదరాబాద్ నుంచి పారిపోయి.. ఖమ్మం చేరిన బాలిక
మసీదు వద్ద ఒంటరిగా ఉండటంతో అధికారులకు సమాచారం ఇచ్చిన స్థానికులు
ఇంటికి వెళ్లేందుకు నిరాకరణ, హైదరాబదులోని వసతిగృహంలో అప్పగింత
ఖమ్మంఖానాపురంహవేలి, డిసెంబరు15: కన్నతల్లి భిక్షమెత్తిస్తుండటంతో ఓ బాలిక ఇంటినుంచి పారిపో యింది. ఇలా ఖమ్మం చేరుకుంది. ఆ బాలికను ఖమ్మం చైల్డ్‌లైన్1098 చేరదీసింది. బుధవారం హైదరా బాదులోని వసతి గృహంలో అప్పగించారు. ఈనెల 6న 16ఏళ్ల బాలిక నగరంలోని శుక్రవారపేట మసీదు వద్ద ఒంటరిగా తిరుగుతోంది. దీంతో స్థానికులు 1098కు సమాచారం అందించారు. చైల్డ్‌లైన్ సమన్వయకర్త కె.శ్రీనివాస్ ఆమెను బాలలసంక్షేమ సమితి ఎదుట హాజరు పరిచారు. బాలికకు కౌన్సెలిగ్ నిర్వహించి వివరాలు తెలుసుకున్నారు. చైర్‌పర్సన్ భారతీరాణి ఆదేశాల మేరకు బాలికను బాలలసదనంలో వసతి ఏర్పాటు చేశారు. బాలిక చిరునామాను యాంటీ హ్యుమన్ ట్రాఫిక్ యూనిట్ యాప్‌లో వివరాలును అప్ లోడ్ చేశారు. వాటి ఆధారంగా హైదరాబాదులోని బంజారాహిల్స్ ప్రాంతంలోని నివసిస్తున్నట్లు కనుగొన్నారు. వివరాలు సేకరించగా సొంత తల్లే భిక్షాటన చేయాలని బలవంతం చేయడంతో, ఆ బాలిక ఇంటినుంచి పారిపోయి ఖమ్మం వచ్చినట్టు శ్రీనివాస్ తెలిపారు. ఈ విషయమై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో తలిపై కేసు నమోదైందని, బాలిక ఇకపై తల్లివద్దకు వెళ్లడం ఇష్టంలేదని తెలపటంతో సీడ బ్ల్యుసీ చైర్‌పర్సన్ భారతీరాణి హైదరాబాదు సీడబ్ల్యుసీతో మాట్లాడారు. బాలికను అక్కడి వసతి గృహంలో ఉండేం దుకు ఏర్పాటు చేశారు. బుధవారం ఉదయం హైదరాబాదులోని వసతిగృహంతో చేర్పించారు.