అన్నదానం బృహత్తర కార్యక్రమం: వనమా

ABN , First Publish Date - 2021-11-10T03:13:25+05:30 IST

అన్నదాన కార్యక్రమం అనేది పేదల కడుపు నింపే ఓ బృహత్తర కార్యక్రమం అని, ప్రతి ఏడా ది పోచమ్మతల్లి దేవాలయం నిర్వాహకులు పల్లా రాజనర్సు అ న్నదాన కార్యక్రమం చేపట్టడం ఎంతో అభినందనీయమని ఎ మ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు.

అన్నదానం బృహత్తర కార్యక్రమం: వనమా
అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న వనమా

లక్ష్మిదేవిపల్లి, నవంబరు 9: అన్నదాన కార్యక్రమం అనేది పేదల కడుపు నింపే ఓ బృహత్తర కార్యక్రమం అని, ప్రతి ఏడా ది పోచమ్మతల్లి దేవాలయం నిర్వాహకులు పల్లా రాజనర్సు అ న్నదాన కార్యక్రమం చేపట్టడం ఎంతో అభినందనీయమని ఎ మ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు.  మంగళవారం లక్ష్మి దేవిపల్లి మండల పరిధిలోని ఇంల్లెదు గెస్ట్‌హౌస్‌ ఎదురుగా ఉన్న పోచమ్మతల్లి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కా ర్యక్రమంలో ఎమ్మెల్యే వనమా పాల్గొని అన్నవితరణ చేశారు.  అనంతరం ఎమ్మెల్యే వనమా మాట్లాడుతూ పండుగల సమ యంలో ఉత్సవాలు ముగిసిన అనంతరం పేదలకు అన్నదానం చేయడం అనేది హిందువుల సంప్రదాయంగా వస్తుందని,  ఇటువంటి కార్యక్రమాల ద్వారా పుణ్యఫలం సిద్దిస్తుందని ఉద్ఘాటించారు. ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని ఆయన నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆ లయ వ్యవస్థాపకులు పల్లా రాజనర్సు, టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, భక్తులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-11-10T03:13:25+05:30 IST