సుజాతనగర్‌ మండలంలో వనమా పర్యటన

ABN , First Publish Date - 2021-02-06T03:53:52+05:30 IST

సుజాతనగర్‌ మండలంలో ఎమ్మెల్యే వనమా శుక్రవారం విస్తృతంగా పర్యటించారు.

సుజాతనగర్‌ మండలంలో వనమా పర్యటన
మాట్లాడుతున్న ఎమ్మెల్యే వనమా

సుజాతనగర్‌, ఫిబ్రవరి 5: సుజాతనగర్‌ మండలంలో ఎమ్మెల్యే వనమా శుక్రవారం విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా రూ. రెండు కోట్లతో అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. మండలంలోని సుజాతనగర్‌ పంచాయతీలో నూతనంగా 22 లక్షల రూపాయలతో నిర్మిం చిన రైతువేదికను ప్రారంభించారు. అనంతరం ఆయన మా ట్లాడుతూ...నేను ఒక రైతు బిడ్డనే అని వార్డు మెంబర్‌ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగానని, దేవుడు నాకు ఈ అవకాశం కల్పించాడని ఆ దేవుడుకి తప్ప ఎవరికీ నేను భయపడనని అన్నారు.


సుజాతనగర్‌ మండలం అంటే నాకు చాలా అభిమానమని, ఒకప్పుడు సిరులపురం ఈ సిరిపురం అని కొనియాడారు. ఎంతో పేరు ప్రఖ్యాతులున్న ఈ సుజాతనగర్‌కు గ్రహణం పట్టిందని, రైతులు ఎవరూ అధైర్యపడవద్దని ఆ గ్రహణం వీడే రోజలు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. గతంలో ఎలా ఉందో అలాగే ఉంటుందని, దానిని ఎవరూ మార్చలేరని తేల్చి చెప్పారు. సుజాతనగర్‌కు పట్టిన గ్రహణం వీడేంతవరకు, న్యాయం కోసం ఎంత దూరమైనా వెళ్తానని, అనుకున్నది సాధించేం త వరకు, రైతులకు అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. అభివృద్ధే తన ధ్యేయమని, తన హయాంలో ఎంతో అభివృద్ధి చేశానని తెలిపారు.


రాష్ట్రంలో కేసీఆర్‌ హాయంలో ఎంతో అభివృద్ధి జరుగుతోందని అన్నారు. పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని ఆయన కొనియాడారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పేదల సంక్షేమమే తమ ధ్యేయమని అన్నారు. మున్ముందు మరింత అభివృద్ధి చేస్తానని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే వనమాను మండల ఫెర్టి లైజర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.


ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు వన మా రాఘవ, జడ్పీ వైస్‌ ఛైర్మన్‌ కంచెర్ల చంద్రశేఖర్‌రావు, జిల్లా వ్యవసాయాధికారి అభిమన్యుడు, పీఏసీఎస్‌ ఛైర్మన్‌ మండే వీర హనుమంతరావు, ఎంపీపీ భూక్యా విజయలక్ష్మి, ఆత్మ ఛైర్మన్‌ బత్తుల వీరయ్య, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షులు లిం గం పిచ్చిరెడ్డి, రైతు సమన్వయసమితి మండల కన్వీనర్‌ భాగం మోహన్‌రావు, తహశీల్దార్‌ సునిల్‌కుమార్‌ రెడ్డి, ఎంపీడీవో వెంకటలక్ష్మి, ఏడీఏ కరుణశ్రీ, ఎంపీటీసీలు బత్తుల మానస, పెద్దమళ్ల శోభారాణి, సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-02-06T03:53:52+05:30 IST