రైతు బాంధవుడికి వందనం

ABN , First Publish Date - 2021-06-23T05:06:07+05:30 IST

రైతుబంధు, ధాన్యం కొనుగోళ్లతో ఆదుకున్న రైతు బాంధవుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వందనమని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు.

రైతు బాంధవుడికి వందనం
అదనపు కలెక్టర్‌ను సన్మానిస్తున్న ఎమ్మెల్యే సండ్ర

సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య

సత్తుపల్లి, జూన్‌ 22 : రైతుబంధు, ధాన్యం కొనుగోళ్లతో ఆదుకున్న రైతు బాంధవుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వందనమని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. నియోజకవర్గంలో ధాన్యం కొనుగోళ్లలోముఖ్య భూమిక వహించిన ప్రభుత్వ అధికారులను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం సన్మానించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ ఎన్‌.మధుసూదన్‌, డీఆర్‌డీఏ పీడీ విజయచందన, అగ్రికల్చర్‌ జేడీ విజయలక్ష్మీ, జిల్లా పౌరసరఫరాల అధికారి బీ.రాజేందర్‌, డిస్ర్టిక్ట్‌ మేనేజర్‌ సోములు, సివిల్‌ సప్లయ్‌ డీటీ దాసోజు రవికుమార్‌,  వీ.నరసింహారావు, ఏడీఏ ఉల్లోజు నరసింహారావు, సివిల్‌ సప్లయ్‌ డీటీ సురేందర్‌, డీసీవో, డీఎస్‌వో, డీఎంలను ఆయన సన్మానించారు. సత్తుపల్లి, పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ఎన్‌ఆర్‌ఐ పేరెంట్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో పండ్లు, బ్రెడ్లు  అందజేశారు.  కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన్‌ కూసంపూడి మహేష్‌, ఎంపీపీ దొడ్డా హైమావతి పాల్గొన్నారు.

వేంసూరు: రైతునేస్తం, ఆధునిక వ్యవసాయ పనిముట్లు, అద్దె యంత్రాల కేంద్రాన్ని ఎమ్మెల్యే సండ్ర ప్రారంభించారు. వేంసూరు, సత్తుపల్లి, పెనుబల్లి, కల్లూరు, తల్లాడ మండలాల్లోని బ్యాంకులింకేజీ సీసీఎల్‌ కింద రూ.5.80 కోట్లను 86 గ్రూపులకు అందజేశారు. కార్యక్రమంలో డీఆర్‌డీవో విద్యాచందన, బ్యాంకు లింకేజీ డీపీఎం ఆంజనేయులు, శ్రీనివాసరావు, దర్గయ్య, యూనియన్‌ బ్యాంకు మేనేజర్‌ వినోద్‌, ఎంపీపీ పవుట్ల వెంకటేశ్వర రావు, డీసీసీబీ డైరెక్టర్‌ గొర్ల సంజీవరెడ్డి, వెల్ది జగన్మోహన్‌రావు, సర్పంచ్‌ ఎండీ. పైజుద్దీన్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-06-23T05:06:07+05:30 IST