ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను గెలిపించాలి

ABN , First Publish Date - 2021-11-29T04:24:49+05:30 IST

త్వరలో జరగబోయే ఉమ్మ డి జిల్లా స్థానిక శాసన మండలి సభ్యుల ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరుపున పోటీ చేస్తున్న అభ్యర్ధి తాతా మధును గెలిపించాలని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్‌ కోరారు.

ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను గెలిపించాలి
మాట్లాడుతున్న ఎమ్మెల్యే రాములు నాయక్‌

వైరా ఎమ్మెల్యే రాములు నాయక్‌ పిలుపు

జూలూరుపాడు, నవంబరు 28: త్వరలో జరగబోయే ఉమ్మ డి జిల్లా స్థానిక శాసన మండలి సభ్యుల ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరుపున పోటీ చేస్తున్న అభ్యర్ధి తాతా మధును గెలిపించాలని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్‌ కోరారు. ఆదివారం జూలూరుపాడులోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన ఎంపిటీసీ, జెడ్పీటీసీలతో పాటు, ముఖ్య కార్యకర్తలతో ఆయన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ టీఆర్‌ఎస్‌ను గెలిపించేందుకు కృషి చేయాలని కోరారు. సీఎం కేసీఆర్‌ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్ధిని గెలిపించడం ద్వారా గ్రామాల అభివృద్ధి సాధ్య పడుతుందన్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజయానికి కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో సొసైటీ చైర్మన్‌ లేళ్ల వెంకటరెడ్డి, జెడ్పీటీసీ భూక్యా కళావతి, ఎంపిపి లావుడ్యా సోనీ, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు చౌడం నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-11-29T04:24:49+05:30 IST