కబడ్డీ పోటీలు ప్రారంభం

ABN , First Publish Date - 2021-01-14T04:21:59+05:30 IST

మండల పరిధిలోని కొండకొడిమ గ్రామంలో సంక్రాంతిని పురస్కరించుకొని మూడు జిల్లాల స్థాయిలో ఫ్రెండ్స్‌ యూత్‌, ఆ గ్రామస్థులు నిర్వహిస్తున్న కబడ్డీ పోటీలను ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్‌ బుధవారం ప్రారంభించారు.

కబడ్డీ పోటీలు ప్రారంభం
పోటీలను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే రాములు నాయక్‌

వైరా, జనవరి 13: మండల పరిధిలోని కొండకొడిమ గ్రామంలో సంక్రాంతిని పురస్కరించుకొని మూడు జిల్లాల స్థాయిలో ఫ్రెండ్స్‌ యూత్‌, ఆ గ్రామస్థులు నిర్వహిస్తున్న కబడ్డీ పోటీలను ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్‌ బుధవారం ప్రారంభించారు. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, ఏపీలోని కృష్ణాజిల్లాల స్థాయిలో మూడురోజులపాటు కబడ్డీ పోటీలను నిర్వహిస్తున్నారు. క్రీడాకా రులతో కలిసి ఎమ్మెల్యే రాములునాయక్‌, రాష్ట్ర మార్క్‌ఫెడ్‌ వైస్‌చైర్మన్‌ బొర్రా రాజశేఖర్‌ కబడ్డీ ఆడి ఉత్సాహపరిచారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి, ఐక్య తకు దోహదపడతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో బొర్రా రాజ శేఖర్‌తోపాటు జడ్పీటీసీ నంబూరి కనకదుర్గ, ఎంపీపీ వేల్పుల పావని, ము నిసిపల్‌ చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ సూతకాని జైపాల్‌, ముళ్లపాటి సీతరాములు, జిల్లా సోషల్‌ వెల్ఫేర్‌ డీడీ కస్తాల సత్యనారాయణ, కొండకొడిమ,రెబ్బవరం సర్పం చ్‌లు దొంతెబోయిన శ్రీనివాసరావు, సాదం రామారావు, టీఆర్‌ఎస్‌ మండల, వైరా పట్టణ అధ్యక్షుడు మోహన్‌ రావు, దార్న రాజశేఖర్‌ పాల్గొన్నారు.


Updated Date - 2021-01-14T04:21:59+05:30 IST