గురుకుల భవనాలకు స్ధలాల కేటాయింపు

ABN , First Publish Date - 2021-08-28T03:59:14+05:30 IST

ఏజెన్సీ ప్రాంతమైన ఇల్లెందు నియోజకవర్గంలో భవనాలు లభ్యం కాకపోవడంతో ఇతర ప్రాంతాల్లో నిర్వహిస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారీటీ విభాగాల గురుకుల పాఠశాలల భవన సముదాయాలను ని ర్మించేందుకు 30 ఎకరాల స్ధలాలు కేటాయించనున్నట్లు ఎమ్మెల్యే బానోత్‌ హరిప్రియ వెల్లడించారు.

గురుకుల భవనాలకు స్ధలాల కేటాయింపు
మాట్లాడుతున్న ఎమ్మెల్యే హరిప్రియ

ఇల్లెందు, ఆగస్టు 27: ఏజెన్సీ ప్రాంతమైన ఇల్లెందు నియోజకవర్గంలో భవనాలు లభ్యం కాకపోవడంతో ఇతర ప్రాంతాల్లో నిర్వహిస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారీటీ విభాగాల గురుకుల పాఠశాలల భవన సముదాయాలను ని ర్మించేందుకు 30 ఎకరాల స్ధలాలు కేటాయించనున్నట్లు ఎమ్మెల్యే బానోత్‌ హరిప్రియ వెల్లడించారు. ఇల్లెందు, టేకులపల్లి మండలాల్లో ఏర్పాటు చేయా ల్సిన గురుకుల పాఠశాలలు, కళశాలలను ఇతర ప్రాంతాల్లో నిర్వహించడం వ లన అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, ఇల్లెందు, టేకులపల్లి మండ లాల్లోనే గురుకుల భవనాలను నిర్మించాలని అధికారులను ఆదేశించారు. శుక్ర వారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అధికారుల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే హరిప్రియ మాట్లాడుతూ ఇల్లెందు నియోజకవర్గంలో విద్యాసంస్ధల ప్రహరీల నిర్మాణానికి నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి రూ.2కోట్లు కేటాయించనున్నట్లు ప్రకటించారు. బీసీ బాలికల గురుకులానికి బోడు గ్రామంలో, బీసీ బాలుర గురుకులానికి టేకులపల్లిలో, మైనార్టీ గురుకుల పాఠశాల, కళశాలకు ఇల్లెందు మండలం, రేపల్లెవాడలో, ఎస్సీ గురుకులానికి ఇల్లెందు పట్టణంలోని ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలో భవనాల నిర్మాణాలకు 30ఏకరాల భూమి కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ హరిసింగ్‌, తహశీల్ధార్‌ కృష్ణవేణి, మైనారిటీ గురుకులం కోఆర్డినేటర్‌ అనీత, బీసీ గురుకులాల కన్వీనర్‌ బీవీ కృష్ణ వేణి, గిరిజన సంక్షేమశాఖ కోఆర్డినేటర్‌ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-28T03:59:14+05:30 IST